నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. ఈఎస్‌ఐసీలో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు!

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మొత్తం 106 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

esic.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. జూన్ నెల 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. 34 సూపర్ స్పెషలిస్ట్ పోస్టులు, 30 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, 21 అసోసియేట్ ప్రొఫెసర్, 12 సీనియర్ రెసిడెంట్, 9 ప్రొఫెసర్ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి గరిష్ట వయో పరిమితి ఫ్యాకల్టీ పోస్టులకు 67 సంవత్సరాలుగా ఉంది. సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ 45 సంవత్సరాలుగా ఉండటం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ఫీజు 225 రూపాయలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు మాజీ సైనికులు, శారీరక వికలాంగ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకొని ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు కంపెనీ ఎలాంటి అలవెన్స్ లను చెల్లించబోదని తెలుస్తోంది. ఈ విషయాలను గుర్తుంచుకుని ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు వేతనం లభించనుంది.