నిరుద్యోగులకు తీపికబురు.. భారీ వేతనంతో ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో ఉద్యోగ ఖాళీలు!

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. పారామెడికల్‌ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం భారీ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 70 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈసీజీ టెక్నీషియన్, జూనియర్ రేడియోగ్రాఫర్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, ఓటీ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, సోషల్ గైడ్, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్, ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ సర్టిఫికెట్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

https://esic.gov.in/recruitments వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉంది.

ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా 2023 సంవత్సరం అక్టోబర్ 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. తక్కువ ఉద్యోగ ఖాళీలు ఉన్న నేపథ్యంలో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.