రాతపరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా భారీ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వేర్వేరు జోనల్ కార్యాలయాలలో పని చేయడానికి ఒప్పంద ప్రాతిపదికన 115 ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుంచి ఈ సంస్థ దరఖాస్తులను కోరుతుండటం గమనార్హం.

ఈ ఉద్యోగాలలో ప్రాజెక్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ ఖాళీలు 20, టెక్నికల్ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీలు 53, జూనియర్ టెక్నీషియన్‌ (గ్రేడ్‌-2) ఉద్యోగ ఖాళీలు 42 ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఐటీఐ, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 33 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.

టెక్నికల్ ఆఫీసర్‌కు, జూనియర్ టెక్నీషియన్‌ పోస్టులకు మాత్రం 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు అర్హులు కాదు. విద్యార్హతలో వచ్చిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన తుది జాబితాను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్ పూర్తి చేసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుంది.

ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 8, 2024 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 22,528 రూపాయల నుంచి 55,000 రూపాయల వరకు వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. https://www.ecil.co.in/ వెబ్ సైట్ ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.