తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవాలా.. ఈ అదిరిపోయే చిట్కాలు పాటిస్తే చాలు!

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని తెల్లజుట్టు సమస్య వేధిస్తోంది. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా తెల్ల జుట్టు వల్ల నిత్య జీవితంలో చాలామంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి, కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్లు తెల్లజుట్టు సమస్యకు కారణమవుతున్నాయని చెప్పవచ్చు. తెల్లజుట్టు సమస్యకు వైద్యుల దగ్గర కూడా సరైన పరిష్కారం లేదు.

మెలనిన్ లోపం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. వయస్సు పైబడే కొద్దీ శరీరంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోయి జుట్టు రంగు మారడం జరుగుతుంది. బాల నెరుపు వస్తే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. కరివేపాకు, మందారం, గోరింటాకులను సమపాళ్లలో రుబ్బి తలకు రాస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.

పరగడుపున ప్రతిరోజూ కరివేపాకును ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరగబెట్టిన నీళ్లలో బ్లాక్ టీ ఆకులను వేసి జుట్టుకు పట్టించడం ద్వారా మంచి ఫలితాలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. కొబ్బరి నూనె, నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి వదిలేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి వేడి చేయడం ద్వారా కూడా తెల్ల జుట్టు తక్కువ సమయంలో నల్లబడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బంగాళదుంప తొక్కలను నీటిలో మరిగించి ఆ నీటిలో తొక్కలను తీసేసి ఆ లిక్విడ్ తో జుట్టును వాష్ చేసుకుంటే మంచి ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. బ్లాక్ కాఫీని రెగ్యులర్ గా యూజ్ చేయడం ద్వారా తెల్ల జుట్టు సమస్య దూరమవుతుంది.

కొబ్బరి నూనె, ఉసిరి పొడి తరచూ తీసుకోవడం ద్వారా కూడా జుట్టు సంబంధిత సమస్యలు దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మిరియాల పేస్ట్ ద్వారా కూడా జుట్టు సమస్యలు దూరమవుతాయని చెప్పవచ్చు. మెంతుల నూనెను జుట్టుకు పట్టించడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆలివ్ ఆయిల్ ను జుట్టుకు రాయడం ద్వారా కూడా జుట్టు సంబంధిత సమస్యలు దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంది.