చెమట ఎక్కువగా పడుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే ఆ సమస్యకు సులువుగా చెక్!

మనలో చాలామంది ఎండలో ఎక్కువ సమయం ఉండటానికి ఇష్టపడరు. ఎండాకాలంలో సాధారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. చెమట మరీ ఎక్కువగా పడుతుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశం అయితే ఉంటుంది. మధుమేహం, అధిక బరువు, హార్మోన్ల స్థాయిలో మార్పుల వల్ల చెమట ఎక్కువగా పట్టే ఛాన్స్ ఉంటుంది.

చెమట వల్ల శరీరంలోని మలినాలు, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి కానీ చెమట మరీ ఎక్కువగా పడుతుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. చంకల్లో ఎక్కువగా చెమట పడుతుంటే బేకింగ్ సోడా, ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని చంకల్లో అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని శుభ్రం చేస్తే మంచిది. ఈ విధంగా చేయడం ద్వారా అధిక చెమట సమస్యకు చెక్ పెట్టవచ్చు.

గోధుమ గడ్డి జ్యూస్, టమోటా రసం తాగడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభించే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా చేయడంలో ఇవి సహాయపడతాయి. నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా వేసవిలో డీ హైడ్రేషన్ కు గురయ్యే ఛాన్స్ ఉండదు. పచ్చిమిర్చి, మసాలాలు శరీరంలో ఎక్కువ వేడి పుట్టించి ఎక్కువ చెమట రిలీజయ్యేలా చేస్తాయి.

కెఫీన్ నాడీ వ్యవస్థను ప్రేరేపించి అడ్రినలిన్ హార్మోన్ ను రిలీజ్ చేస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల కాఫీని పరిమితంగా తీసుకుంటే మంచిది. ఒత్తిడి, ఆందోళనలు తగ్గించుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు. శరీరానికి గాలి తగిలేలా వదులుగా ఉండే దుస్తులు ధరించడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పవచ్చు.