వేసవికాలం వచ్చిందంటే మామిడిపండ్లను తినడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. మార్కెట్ లో పండ్ల ఖరీదు ఎంత పెరిగినా వీటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడే వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. మామిడి పండ్లను అధికంగా తినడం వల్ల జీర్ణశయావస్థలు, బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, అలెర్జీలు వంటి నష్టాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయ్.
మామిడి పండ్లలో అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి, విరేచనాలు వంటి జీర్ణశయావస్థలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మామిడి పండ్లలో అధిక క్యాలరీలు మరియు షుగర్ ఉండటం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మామిడి పండ్లలో సహజంగానే షుగర్ అధికంగా ఉంటుంది, కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు లేదా బరువు తగ్గాలనుకునేవారు మామిడి పండ్లను పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
కొందరికి మామిడి పండ్ల పట్ల అలెర్జీలు ఉండవచ్చు, దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మామిడిపండ్లను ఎక్కువగా తీసుకుంటే ఉబ్బరం, గ్యాస్, తిమ్మిర్లు, విరేచనాలు, పొత్తికడుపు నొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా మామిడి పండ్లను తీసుకోవడం వల్ల సులువుగా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది.
మామిడి పండ్లలో ఉండే అధిక కేలరీల వల్ల శరీరంలో బరువు పెరుగుతుంది. ఈ పండ్లను ఎక్కువగా తీసుకుంటే దురద, వాపు, దద్దుర్లు, అనాఫిలాక్సిస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మామిడిపండ్లు శరీరంలో షుగర్ లెవెల్స్ ను పెంచుతాయని చెప్పవచ్చు. మామిడిపండ్లను తిన్న తర్వాత నోటిలో లేదా పెదవులపై దురదగా, చిరాకుగా ఉంటుంది.