మనలో చాలామంది ఎంతో ఇష్టంగా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. యువత ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని తెలిసినా చాలామంది ఆ అలవాటును మార్చుకోవడం లేదు. రాత్రి సమయంలో ఆల్కహాల్ తీసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. అయితే నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఒత్తిడి వల్ల, మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది ఆల్కహాల్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. రాత్రి సమయంలో ఆల్కహాల్ తీసుకుంటే దాని ప్రభావం నిద్రపై ఉంటుంది. రాత్రి సమయంలో ఆల్కహాల్ తీసుకుంటే మూత్ర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రాత్రి సమయంలో ఆల్కహాల్ తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి.
నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకుంటే అలసటగానూ, తల పట్టేసినట్టుగానూ అనిపించే ఛాన్స్ ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గే అవకాశాలు సైతం ఉంటాయి. రాత్రి సమయంలో ఆల్కహాల్ తీసుకోవడాన్ని నివారించడమే మంచిదని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆల్కహాల్ వల్ల శరీరానికి నష్టమే తప్ప లాభం లేదు. ఈ అలవాటును వీలైనంత తగ్గించుకుంటే మంచిది.
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో కొత్త సమస్యలు సైతం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్కహాల్ ఇప్పటికే తాగుతున్న వాళ్లు పరిమితంగా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.