శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నవారు ఏ ఆహారం తీసుకోవాలి? ఏ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి… ?

పరమ పవిత్రమైన మాఘమాసం శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాఘ మాసంలో భక్తులందరూ తెల్లవారకముందే భాగ స్థానాలు ఆచరించి శివుడిని పూజిస్తూ ఉంటారు. ఇక మాఘ మాసంలో వచ్చే ఈ మహా శివరాత్రి రోజున ప్రజలందరు ఉపవాసం ఉంటూ,జాగరణ చేసి భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజిస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 18 శనివారం నాడు శివరాత్రి . అంతే కాకుండా శనిత్రయోదశి కూడా అదే రోజు కావటంతో ఈసారి శివరాత్రి విశిష్టమైనది. ఇలా శనిత్రయోదశితో కలసి రావడం వల్ల అద్భుతమైన యోగం, బలాన్ని అందించే పర్వదినంగా ఈ శివరాత్రి నిలుస్తుంది పండితులు చెబుతున్నారు.

ఇక శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఏ ఆహార పదార్థాలను తినాలి. ..ఏవి తినకూడదు అనే సందేహం ఉంటుంది. శివరాత్రి ఉపవాసం రోజు ఏ ఆహార పదార్థాలు తినాలో, వేటిని తినకుడదో ఇప్పుడు తెలుసుకుందాం. మహా శివరాత్రి రోజు తెల్లవారు జామున ప్రారంభం అయిన ఉపవాసం మరుసటి రోజు సూర్యోదయం తో ముగుస్తుంది. శివరాత్రి రోజున ఉపవాసం చేసేవారు బియ్యం, గోధుమ, పప్పులు లాంటి తృణధాన్యాలకు దూరంగా ఉండాలి. ఇక పండ్లు, ఉడకబెట్టిన చిలకగ దుంపలు తినవచ్చు. ఇక వీటితో పాటుగా సగ్గుబియ్యం తో చేసిన కిచిడి లేదా జావ లను అల్పాహారంగా తీసుకోచ్చు.

అలాగే ఉపవాసం ఉండే వారు శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా బెల్లం తో తయారు చేసిన పానకం కూడా తాగవచ్చు. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపవాసం ఉండటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అటువంటి వారు ఉపవాసం ఉండకపోవటంమంచిది. ఒకవేళ ఉపవాసం ఉండాలనుకుంటే పాలు, పండ్లు లాంటి శక్తిని ఇచ్చే పదార్థాలు తినాలి. ఇక శివరాత్రి రోజున చాలా మంది శివరాత్రి రోజు ‘నిర్జల వ్రతాన్ని’ మాత్రమే ఆచరిస్తారు. అంటే కేవలం నీరు తీసుకొని వ్రతం చేస్తారు.