ప్రస్తుత కాలంలో మనుషుల కన్నా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరూ డబ్బు ఉన్న ధనవంతులకి ఎక్కువగా గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. అందువల్ల ప్రతి ఒక్కరు తమ జీవితంలో కష్టపడే ధనవంతులుగా అవ్వటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత కష్టపడి పని చేసినా కూడా ఏదో ఒక సందర్భంలో ఇతరుల వద్ద అప్పు చేయవలసి వస్తుంది. అయితే అత్యవసర సమయాలలో కొందరు ఎప్పుడు పడితే అప్పుడు అప్పు తీసుకుంటూ ఉంటారు. ఆపు చెల్లించడానికి ఎంత కష్టపడినా కూడా ఏళ్లు గడిచిన అప్పు మాత్రం తీరదు. ఇలా జరగటానికి కారణం సరైన సమయంలో అప్పు తీసుకోకపోవడం.
జ్యోతిష శాస్త్ర ప్రకారం అశుభ ఘడియల్లో అప్పు తీసుకోవడం వల్ల జీవితాంతం కష్టపడినా కూడా ఆపు తీరదు. జ్యోతిషా శాస్త్ర ప్రకారం వారంలో కొన్ని రోజులు అస్సలు అప్పు తీసుకోకూడదు. పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం…అప్పు తీసుకోవడానికి సమయం, తేదీ చాలా ముఖ్యం. ఎప్పుడు పడితే అప్పుడు ఆ శుభ ఘడియల్లో అప్పు తీసుకుంటే ఎన్నో సమస్యలు ఎదుర్కో వల్సి వస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం…మంగళవారం, బుధవారం, శనివారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల వద్ద అప్పు చేయకూడదు. అంతేకాకుండా హస్త, మూల, అద్ర, జ్యేష్ట, విశాఖ, ఉత్తరాఫాల్గుణి, ఉత్తరాషాడ, ఉత్తర భాద్రపద, రోహిణి వంటి ఆశుభ నక్షత్రాల్లో ఇతరుల వద్ద అప్పు చేసినా కూడా జీవితాంతం ఆ రుణం తీర్చలేక పోతారు.
ముఖ్యంగా మంగళవారం అంగారుకుడిచే పాలించబడుతుంది . అంగారకుడు కోపం, అశాంతి, ప్రతీకార స్వభావంతో ఉంటాడు. కాబట్టి మంగళవారం అప్పు తీసుకోకూడదు.
అయితే మంగళవారం రోజున తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించటం చాలా మంచిది. సోమవారం, బుధవారం, ఆదివారం ఆదివారం రోజున అప్పు తీసుకోవడం వల్ల ఆ అప్పు తొందరగా తీరిపోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్వాతి, పునర్వసు, ధనిష్ట, శతభిష, మృగశిర, రేవతి, చిత్ర, అనురాధ, అశ్విని, పుష్య వంటి శుభ నక్షత్రాలలో ఇతరుల వద్ద అప్పు చేయటం లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల అత్యవసర సమయాలలో కూడా మంగళవారం, బుధవారం, శనివారం రోజున పొరపాటున కూడా అప్పు చేయకండి.