ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కాకి అరుపులు వినిపించడం దేనికి సంకేతమో తెలుసా..?

సాధారణంగా జ్యోతిష్య శాస్త్రంలో వివిధ రకాల పక్షులకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అలాగే కాకికి కూడా జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడి వాహనమైన కాకి మన జీవితంలో జరగబోయే సంఘటనలు గురించి ముందే సంకేతాలు ఇస్తుంది. అంతేకాకుండా చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో ఎల్లప్పుడూ మన చుట్టూ తిరుగుతూ ఉంటారని ప్రజల నమ్మకం. జ్యోతిష శాస్త్ర ప్రకారం మన జీవితంలో జరగబోయే సంఘటన గురించి కాకి ఎలాంటి సంకేతాలు ఇస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా చనిపోయిన మన పూర్వీకులకు పిండ ప్రధానం చేసిన తర్వాత కాకి వచ్చి ఆహారాన్ని తింటుంది. ఎందుకంటే మన పూర్వీకులు కాక రూపంలో వచ్చి పిండ ప్రదానం చేసిన ఆహారాన్ని తింటారని ప్రజల నమ్మకం. ఒకవేళ విన్న ప్రధానం చేసిన ఆహారాన్ని కాకి తినకపోతే చనిపోయిన మన పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నట్లు భావించవచ్చు. మనం ముఖ్యమైన పనుల మీద ఇంటి నుండి బయటకు వెళుతున్న సమయంలో కాకి ఎదురు వచ్చి అరుస్తూ వెళ్లిపోతే అది శుభశకునంగా భావించవచ్చు. ఇలా అరుస్తూ కాకి ఎదురు రావడం వల్ల మనం చేపట్టిన పనులలో విజయం వరిస్తుందని సంకేతం. అయితే తరచూ కాకి అరుస్తూ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే అదే అశుభంగా భావించవచ్చు. ఇలా ఇంటి చుట్టూ కాకులు అరుస్తూ తిరగటం వల్ల ఆ ఇంట్లో అశుభం జరుగుతుందని తెలిపే సంకేతం.

సాధారణంగా రోడ్డు మీద నడుచుకొని వెళ్లేటప్పుడు కాకులు మన తల మీద కాళ్లతో తన్ని పోతుంటాయి. అయితే పురుషులను ఇలా కాకి కాళ్లతో తినటం అనేది అశుభంగా భావించవచ్చు. ఇలా కాకి తలపై తనటం వల్ల ఆ వ్యక్తి అవమానాలు పాలవుతాడు. అయితే మహిళ తలపై కాకి ఇలా తన్నటం ఆమె భర్త ప్రాణాపాయంలో ఉన్నట్లు తెలిపే సంకేతం. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు కాకి ఆగ్నేయ దిశగా రావడం చూసినట్లయితే మీరు అనుకున్న పని నెరవేరుతుందని, ద్రవ్య లాభం పొందుతారని సంకేతం . అలాగే కాకి మన ఇంటిపై కూర్చొని పదేపదే అరవటం మన ఇంటికి చుట్టాలు రాబోతున్నారని తెలిపే సంకేతం.