సాధారణంగా మానవ శరీరంలోని మృతకణాలతో గోర్లు ఏర్పడతాయి. చేతి వేళ్ళు కాలి వేళ్లకు బోర్లు రోజురోజుకీ పెరుగుతూ ఉంటాయి. మన శరీరంలోని మృతకనాలతో తయారైన ఈ గోర్లు పెరిగినప్పుడు వాటిని కత్తిరించుకోవాలి. అయితే కొంతమంది గోర్లను నోటితో కొరుకుతూ ఉంటారు. ఇలా గోర్లు కొరికే అలవాటు చాలా ప్రమాదకరమైనది. ఈ అలవాటు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల గోర్లను ఎప్పుడు కొరకకుండా కత్తిరించుకోవాలి. అయితే గోర్లను కత్తిరించుకోవడంలో కూడా అనేక నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించి గోర్లు కత్తిరించుకోవడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. గోర్లను కత్తిరించే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జ్యోతిష శాస్త్ర ప్రకారం మనిషి శరీరంలో భాగమైన గోర్లు వెంట్రుకలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలా శుభ్రంగా లేనియెడల శని దేవుడు ఆగ్రహానికి గురి కావల్సి వస్తుంది. అందుకే గోర్లు కత్తిరించే రోజు, సమయం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే పేదరికం అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళ, గురు, శనివారాల్లో గోర్లను కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల కుజుడు, గురు, శని గ్రహాలు అశుభ ఫలితాలను ఇవ్వడం మొదలుపెడతాయి. ఆ రోజులలో గోర్లు కత్తిరించడం వల్ల బలహీనమైన కుజుడు వివాహం, సంపద మరియు ధైర్యం లేకపోవడం వంటి సమస్యలను కలిగిస్తాడు.
శనివారం రోజు గోర్లు కత్తిరించడం వల్ల శని గ్రహా ఆగ్రహానికి గురి కావల్సి వస్తుంది. అంతేకాకుండా అమావాస్య తిథిలలో గోర్లను కత్తిరించడం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. చతుర్దశి మరియు అమావాస్య రోజున గోర్లు లేదా జుట్టు కత్తిరించడం వలన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే సూర్యాస్తమయం తర్వాత కూడా గోర్లు కత్తిరించడం ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమ, బుధ,శుక్ర, ఆదివారాలలో పగటిపూట మాత్రమే కత్తిరించుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల పేదరికం దూరమైపోయి ఆ వ్యక్తికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు.