ఆచార్య చానిక్యుడు తన నీతి గ్రంథం ద్వారా ఒక మనిషి ఎదుగుదలకు ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియచేశారు. ఒక మనిషి ఉన్నత స్థానంలో ఉండాలంటే ఆయన ఎలాంటి నియమాలను పాటించాలి. ఎలాంటి వ్యక్తులతో సావాసం చేయాలి ఎవరిని దూరం పెట్టాలి అనే విషయాల గురించి ఎంతో అద్భుతంగా వివరించాడు. ఈ క్రమంలోనే ఆచార్య చాణిక్యుడు మన జీవితంలో నలుగురు వ్యక్తులతో ఏమాత్రం వాదనకు దిగకూడదని అలాంటి వ్యక్తులతో వాదనకు వెళ్లడం మనకే మంచిది కాదని వెల్లడించారు. మరి ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అనే విషయానికి వస్తే….
గురువులు:మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ప్రసాదించిన గురువులతో ఎప్పుడూ కూడా మనం వాదనకు దిగకూడదు. అందుకే గురువులతో వాదన మంచిది కాదని అది మనకే చాలా ప్రమాదకరమని ఆచార్య చాణిక్యుడు తెలిపారు.
మూర్ఖులు: మూర్ఖులతో ఎప్పుడు కూడా వాదనకు దిగకూడదు మూర్ఖులు ఏ విషయం గురించి తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారితో వాదించడం కన్నా అక్కడితో వదిలేసి బయటకు రావడం ఎంతో ఉత్తమం.
మిమ్మల్ని ఎంతో ఇష్టపడేవారు: మిమ్మల్ని ఎంతో ఇష్టపడే వారితో కూడా ఎప్పుడు వాదనకు దిగకూడదు. ఇది మీకు మిమ్మల్ని ఇష్టపడే వారికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది.
మంచి స్నేహితుడు:సాధారణంగా నీతిగా నిజాయితీగా ఉండే స్నేహితులు దొరకడం చాలా అరుదు అలాంటి స్నేహితులతో గొడవపడితే ఒక మంచి స్నేహితుడిని మీరు కోల్పోయినట్లు అవుతారు. అందుకే మంచి స్నేహితులతో ఎప్పుడూ కూడా వాదనకు దిగకూడదని ఇలా వాదనకు దిగితే అది మనకే ప్రమాదమని ఆచార్య చాణిక్యుడు తన నీతి గ్రంధం ద్వారా ఈ నలుగురు వ్యక్తులతో వాదనకు దిగకూడదని తెలిపారు.