గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నరా..తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ ఇస్తున్న బ్యాంకుల వివరాలు..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం ఎంతో ఉంటుంది. ఈ క్రమంలో అత్యవసర సమయంలో బ్యాంకుల నుండి, లోన్ యాప్ ల నుండి రుణాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా లోన్ తీసుకోవాలనుకునే వారికి గోల్డ్ లోన్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. అత్యవసర సమయాల్లో బంగారంపై రుణం తీసుకోవడం మరింత సులభంగా ఉంటుంది.బంగారం పరిమాణం, స్వచ్ఛత ఆధారంగా బ్యాంకులు రుణం ఇస్తాయి. బంగారం మీద లోన్ తీసుకోవడం అనేది చాలా సులభమైన ప్రక్రియ. అంతేకాకుండా బంగారం పెట్టి తీసుకొని లోన్ కి తక్కువ వడ్డీతో పాటు, సర్దుబాటు చేయగల పదవీకాలం కూడా అందించడం జరుగుతుంది. ఈ క్రమంలో కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఆ బ్యాంకులో వివరాల గురించి తెలుసుకుందాం.

• యూకో బ్యాంక్ లో బంగారం రుణాలపై 8.50 శాతం వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు 250 నుంచి 5000 రూపాయల వరకు ఉంటుంది.

• స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గోల్డ్ లోన్‌పై వడ్డీ 8.55%, ప్రాసెసింగ్ 0.50% + GST ఉంటుంది.

• ఇక ఇండస్‌ఇండ్ బ్యాంక్ లో గోల్డ్ లోన్‌పై 8.75% నుంచి 16% వరకు వడ్డీని వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఛార్జీ 1% శాతం ఉంటుంది.
• సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో గోల్డ్ లోన్ పై 8.45% నుంచి 8.55% వరకు వడ్డీ 0.5% ప్రాసెసింగ్ ఛార్జీని కలిగి ఉంది.
• కోటక్ మహీంద్రా బ్యాంక్ గోల్డ్ లోన్‌పై 8% నుంచి 17% వరకు వడ్డీ ఉంటుంది. దానిపై 2% ప్రాసెసింగ్ ఫీజు GSTతో ఉంటుంది.
• అలాగే యూనియన్ బ్యాంక్ లో గోల్డ్ లోన్ పై 8.40 శాతం నుండి 9.65 శాతం వరకు వడ్డీ ఉంటుంది.
• పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వడ్డీ 8.85 శాతం, ప్రాసెసింగ్ ఛార్జీ రూ. 500 నుంచి రూ. 10,000 వరకు ఉంటుంది.

గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునేవారు పైన తెలిపిన బ్యాంకులలో గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల తక్కువ వడ్డీ వర్తిస్తుంది. అయితే గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునే వారు ఒకటిన్నర లక్షకు మించి లోన్ తీసుకోకపోవడం మంచిది.