పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. punjabandsindbank.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

2023 సంవత్సరం జులై 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. మొత్తం 183 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ఐటీ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 24 ఉండగా అధికారిక భాషా అధికారి 2, సాఫ్ట్‌వేర్ డెవలపర్ 20, లా మేనేజర్ 6, చార్టర్డ్ అకౌంటెంట్ 33, ఐటీ మేనేజర్ 40, సెక్యూరిటీ ఆఫీసర్ 11, అధికారిక భాషా అధికారి 5, డిజిటల్ మేనేజర్ 2, ఆఫీసర్స్ ఉద్యోగ ఖాళీలు 6 ఉన్నాయి.

 

మార్కెటింగ్ లేదా రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 17 ఉండగా టెక్నికల్ ఆఫీసర్ జాబ్ 1, డిజిటల్ మేనేజర్ 2, రిస్క్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి. ఎకనామిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 2, ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 2 ఉండగా లా మేనేజర్ ఉద్యోగ ఖాళీ 1, ట్రెజరీ డీలర్ ఉద్యోగ ఖాళీలు 2, డీలర్స్ ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.

 

35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. రాత పరీక్ష, అభ్యర్థుల షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష పాసైన వాళ్లు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.