Crime News: ఉత్తర ప్రదేశ్ లో దారుణం.. ట్రాన్స్ఫర్ కావాలంటే భార్యను ఒక రాత్రి పంపాలంటూ వేధింపులు..!

Crime News: దేశంలో లో ఆడదానికి రక్షణ లేకుండా పోతోంది. కొందరు మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ఇటీవల దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్ఫర్ కావాలని అడిగిన లైన్ మెన్ పట్ల విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఒక ఉద్యోగి దారుణంగా ప్రవర్తించాడు. ట్రాన్స్ఫర్ కావాలంటే వారిని ఒక రాత్రి నాతో గడపటానికి పంపించాలంటూ మూడు సంవత్సరాలు ట్రాన్స్ఫర్ చేయకుండా వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్థాపం చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే…లఖింపూర్ ప్రాంతంలో ఉన్న విద్యుత్ శాఖలో.. గోకుల్ ప్రసాద్(45) గత కొన్ని సంవత్సరాలుగా లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఇతను అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయాలని మూడేళ్లుగా అధికారులను వేడుకుంటున్నాడు. ఈ క్రమంలో.. విద్యుత్ కార్యాలయం లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నాగేంద్ర కుమార్, మరో క్లర్క్ ఇతడి పట్ల దారుణంగా ప్రవర్తించారు . అంతటితో ఆగకుండా అధికారులు మరింత రెచ్చిపోయి అతడి భార్య పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

ట్రాన్స్ ఫర్ కావాలంటే.. నీ భార్యను రాత్రికి మాతో గడపటానికి పంపాలంటూ అతనిని దారుణంగా వేధించారు. ఈ విషయం గురించి అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన గోకుల్ ప్రసాద్ శనివారం కార్యాలయం ఎదుట కిరోసిన్ పోసుకుని సెల్ఫీ సూసైడ్ చేసుకున్నాడు. వెంటనే అధికారులు అప్రమత్తమై చికిత్స నిమిత్తం గోకుల్ ప్రసాద్ ని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో గోకుల్ ప్రసాద్ చికిత్స తీసుకుంటూ ఆదివారం మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.