ఆధార్ కార్డులో ఈ వివరాలను మార్పులు చేయాలా… సింపుల్ గా ఇలా చేసేయండి!

29_05_2022-aadhar_227546831666951873071

ప్రస్తుత కాలంలో మనం ఉపయోగించే కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి.ఈ ఆధార్ కార్డుతో ఇతర డాక్యుమెంట్స్ కూడా అనుసంధానం చేయబడి ఉన్నాయి కనుక ఆధార్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇందులో మన పేరు కనుక తప్పబడి ఉంటే ఇతర పనులు కూడా ముందుకు సాగవు అందుకే ఆధార్ కార్డు విషయంలో ఎప్పటికప్పుడు ఉన్నటువంటి తప్పులను అప్డేట్ చేసుకుంటూ ఉంటారు.

ఒకప్పుడు ఆధార్ కార్డులో ఈ మార్పులు చేయాలంటే ఎంతో ప్రాసెస్తో కూడుకున్న పని అయితే ప్రస్తుతం ఇది చాలా సులభంగా మారిపోయింది. ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా సింపుల్ గా మనం ఆ తప్పులను వెంటనే అప్డేట్ చేసుకోవచ్చు.ముఖ్యంగా మీ ఆధార్ కార్డులో మీ పేరు కనుక తప్పు పడి ఉంటే ఇలా సింపుల్ పద్ధతిలో మీ పేరును సరైన విధంగా అప్డేట్ చేసుకోవచ్చు ఇందుకుగాను ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…

ముందుగా https://ssup.uidai.gov.in/ssup/ పోర్టల్ ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేయగానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటిపి ఎంటర్ చేసిన తర్వాత సర్వీసెస్ ట్యాబ్‌లో Update Aadhaar Online పైన క్లిక్ చేయాలి. Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి. ఇదిలా ఉండగా యూఐడీఏఐ 27 ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అప్‌డేట్ కోసం అంగీకరిస్తుంది. వాటిపై పేరు, ఫోటో తప్పనిసరిగా ఉండాలి. పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ , రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్స్ జత చేయాల్సి ఉంటుంది.