ఆధార్ కార్డులో పేరు మార్చుకోవటానికి ఎన్నిసార్లు అవకాశం ఉంటుందో తెలుసా..?

29_05_2022-aadhar_227546831666951873071

భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరునికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డ్ అనేది మనిషికి ఒక గుర్తింపు కార్డు లాంటిది. అందువల్ల పుట్టిన పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కలిగి ఉండాలని కేంద్రం సూచించింది ప్రభుత్వ పథకాల దారా లబ్ధి పొందడానికే కాకుండా ఇతర పనులకు కూడా ఆధార్ కార్డు చాలా అవసరం. ఎంతో ముఖ్యమైన ఈ ఆధార్ కార్డులో పేరు,చిరునామా, ఫోన్ నెంబర్ వంటి వివరాలు కొన్ని సందర్భాలలో తప్పుగా ఉంటాయి. అటువంటి సమయంలో వాటిని మరలా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో ఆధార్ కార్డు లో ఏమైనా తప్పులుంటే.. వాటిని మార్చుకోవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తెలిపింది.

ఆధార్ కార్డులో తప్పుల సవరణకు, అప్ డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ అవకాశం కల్పించింది. కాకపోతే ఆధార్ కార్డు లోని కొన్ని వివరాలను పదే పదే మార్చుకోవడానికి వీలులేదని స్పష్టం చేసింది. ఆధార్ కార్డులో పేరు, జెండర్, పుట్టిన తేదీ తదితర వివరాలను ఒకసారి మాత్రమే మార్చుకునే వీలుంటుందని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఒక్కసారి మార్పులు చేసాకా మళ్ళీ మర్పులు చేయడానికి వీలు లేదు.

అయితే ఆధార్ కార్డు లో ఉన్న పేరు పేరు నమోదులో తప్పులు దొర్లితే రెండు సార్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వివాహం తర్వాత స్త్రీలు తమ ఇంటి పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆధార్ కార్డులో పేరుని రెండుసార్లు మార్చుకొని అవకాశాన్ని కల్పించింది. ఆన్ లైన్ , మీ సేవా సెంటర్ లో ఆధార్ కార్డులోని పేరును మార్చుకోవచ్చు.
అయితే ఆధార్ కార్డులో వివరాలు నమోదు చేసే సమయంలో జెండర్ విషయంలో పొరపాటు జరిగితే ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు యూఐడీఏఐ వీలు కల్పించింది.

ఇక పుట్టిన తేదీ విషయంలో కూడా ఒకేసారి మార్పులు చేర్పులకు అవకాశం ఉంది. ఇక ఆధార్ లో పేర్కొన్న నివాస స్థలం, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, ఫొటో, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లలో మార్పులు చేర్పులకు ఎలాంటి పరిమితి లేదు. ఈ వివరాలు తరచుగా మారే అవకాశం ఉంది. చిరునామా, ఫోన్ నెంబర్ మార్పులు చేసుకోవచ్చు.