సాధారణంగా కొన్నిసార్లు మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ అవుతుంటాము అయితే అది ఉద్యోగ రీతి ఆయన లేదా ఇతర కారణాలవల్ల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారినప్పుడు మనకు నిత్యవసర వస్తువులలో ఒకటైన గ్యాస్ సిలిండర్ మారడం కష్ట తరంగా మారుతుంది. ఒక ప్రాంతంలో రిజిస్టర్ అయిన గ్యాస్ సిలిండర్ మరొక ప్రాంతంలో బుక్ చేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి.అయితే మనం బదిలీ అయిన ప్రాంతానికి మన గ్యాస్ సిలిండర్ ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు..
ఇలా మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ప్రాంతానికి గ్యాస్ సిలిండర్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల మనం గ్యాస్ బుక్ చేసుకోవడానికి ఎంత సులభతరం అవుతుంది. మరి గ్యాస్ సిలిండర్ ను ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే… ఇండేన్ గ్యాస్ వాడే వారు మొదట ఇండియన్ ఆయిల్ వన్ అనే మొబైల్ యాప్‌ను ఇంస్టాల్ చెయ్యాల్సి వుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేయండి. ఇప్పుడు యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు ఎడమవైపు మూడు చుక్కలు కనపడతాయి ఈ మూడు చుక్కలను క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ మీకు ఎల్‌పీజీ, సిలిండర్ ప్లేస్, ఫ్యూయెల్ స్టేషన్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి.
ఎల్‌పీజీ ఆప్షన్‌పై క్లిక్ చేసేయండి. ఓ పేజీ వస్తుంది. ఇందులో డొమెస్టిక్ కనెక్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
మీకు బుకింగ్ హిస్టరీ, కంప్లైంట్ హిస్టరీ, లాస్ట్ లేదా రిప్లేస్‌మెంట్, మెకానిక్, డీబీసీ, చేంజ్ డిస్ట్రిబ్యూటర్ వంటివి కనపడతాయి. మీరు చేంజ్ డిస్ట్రిబ్యూటర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత సిటీ అడ్రస్ చేంజ్ బటన్ పై క్లిక్ చేయాలి ఇప్పుడు మీరు ఉంటున్న ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి.ఇలా పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మీకు అందుబాటులో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్ కనపడుతుంది. ఇందులో మీకు ఎవరైతే అనుకూలంగా ఉంటారు. ఆ డిస్ట్రిబ్యూటర్లను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.