బావులు ఎప్పుడు గుండ్రంగానే ఎందుకు ఉంటాయో తెలుసా… దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే?

పూర్వకాలంలో మనకు తాగునీటి లేదా ఇతర అవసరాల కోసం నీరు కావాలంటే నదులు వాగులు వంకలు మీద ఆధార పడే వాళ్ళం. ఇలా నదులకు వెళ్లి మన తాగునీరును ఇతర అవసరాల కోసం నీటిని తెచ్చుకునేవారు. అయితే నీటి అవసరం పెరగడంతో ప్రజలు తమ ఇళ్ల ప్రాంతంలోనే బావులను తవ్వి బావుల ద్వారా వచ్చినటువంటి నీటిని వారి అవసరాలకు ఉపయోగించుకునేవారు. ఈ క్రమంలోని ఇప్పటికీ మనం పల్లెటూర్లకు వెళితే ఊరి మధ్యలో బావులు కనపడుతూ ఉంటాయి.

ఇకపోతే ప్రస్తుత కాలంలో బావులు కూడా కనుమరుగవుతున్నాయి ప్రతి ఒక్క ఇంటికి బోరు బావులు లేదా మున్సిపాలిటీ కొళాయిలో ఉండటం వల్ల బావుల సంఖ్య కనుమరుగవుతోంది.ఇకపోతే పూర్వకాలంలో కనుక చూస్తే బావులన్నీ కూడా మనకు గుండ్రాకారంలో మాత్రమే కనిపిస్తాయి. ఎక్కడ కూడా త్రిభుజాకారంలో కానీ లేదా దీర్ఘ చతురస్రాకారంలో బావులు కనపడవు.అయితే బావులు గుండ్రంగా తవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు అయితే దీని వెనుక కూడా సైన్స్ దాగి ఉంది.

బావులు కేవలం గుండ్రంగా మాత్రమే ఉండడం వెనుక గల కారణం ఏంటని విషయానికి వస్తే… బావులు గుండ్రంగా కాకుండా ఇతర ఆకారంలో ఉండటం వల్ల ఆ మూలల్లో నీటి పీడనం ఎక్కువగా ఉండడం వల్ల వాటిల్లో త్వరలోనే పగుళ్లు ఏర్పడి తక్కువ సమయంలోనే బావి కూలిపోవడం జరుగుతుంది. కాగా, వృత్తాకార బావుల్లో ఈ సమస్య ఉండదు. దీనిలో, మొత్తం గోడ గుండ్రని కారణంగా నీటి పీడనం భావి మొత్తం సమానంగా ఉండటం వల్ల బావి ఏమాత్రం చెక్కుచెదరకుండా కొన్ని దశాబ్దాలుగా అలాగే ఉన్నాయి అందుకే బావులను గుండ్రంగా మాత్రమే తవ్వే వాళ్ళు.