సాధారణంగా భార్యాభర్తలు అన్న తర్వాత వారి మధ్యన గొడవలు రావడం సర్వసాధారణం. అయితే కొందరు చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేస్తూ విడాకుల వరకు వెళ్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం వారి మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చిన ఎలాంటి గొడవలు చోటు చేసుకున్న కూడా అప్పటికి గొడవ పడిన వారు మాత్రం విడిపోరు.ఇలా భార్య భర్తలు గొడవ పడినప్పటికీ విడిపోకుండా కలిసి ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే..
చాలామంది భార్య భర్తలు గొడవలు పడినప్పటికీ వారి మధ్య జరిగిన గొడవలు పెద్దదిగా చూడకుండా వాటిని కేవలం చిన్న గొడవలుగా మాత్రమే చూస్తారు. ఇలా జరిగిన విషయాలను పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల తిరిగి భార్య భర్తలు కలిసి ఉంటారు . ఇక చాలామంది వారి మధ్య జరిగిన గొడవల కన్నా వారి మధ్య ఉన్న బంధానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల జరిగిన గొడవలను మరిచిపోయి ఎప్పటిలాగే సంతోషంగా ఉంటారు. ఇక ఎంతోమంది భార్యాభర్తలు అప్పటికి గొడవపడిన ఇకపై మా మధ్య ఎలాంటి గొడవలు ఉండవు అని భావిస్తూ కలిసిపోతుంటారు.
ఇక చాలామంది గొడవ పడిన తర్వాత విడిపోకుండా ఉండడానికి మరో కారణం ఉంది.నా జీవితం ఇకపై చాలా గొప్పగా ఉంటుంది గొప్పగా జీవించాలన్న భావనతో ఆ గొడవను అంతటితో మరిచిపోయి సంతోషంగా ఉంటారు.ఇక మరికొందరు గొడవ పడిన వెంటనే విడిపోకుండా ఉండడానికి గల కారణం వారికి మరొక అవకాశం ఇవ్వడమే. ఈసారైనా తన భర్తలో లేదా భార్యలో మార్పు వస్తుందేమో ఎదురు చూద్దాం అంటూ వీరు విడిపోకుండా ఉంటారు.