ప్రస్తుత కాలంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు అందుకే ప్రతి ఒక్కరు సంపాదించిన ప్రతి రూపాయిని దాచిపెడుతున్నారు. ఇలా సంపాదించిన దానిని కొందరు లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా సేవ్ చేయగా మరికొందరు సేవింగ్ స్కీమ్స్ ద్వారా సంపాదించిన డబ్బును దాచిపెడుతున్నారు.అయితే ఈ రెండింటిలో ఎక్కడ మనం డబ్బులను పెట్టుబడిగా పెట్టి సేవ్ చేయడం మంచిది అని విషయానికి వస్తే…
ఇన్సూరెన్స్ కింద ఏదైన వ్యక్తికి అనుకోకుండా ఘటన జరిగితే కొంత మొత్తం డబ్బు అందుతుంది. కుటుంబంలో సంపాదించే సభ్యుడు మరణించిన సందర్భంలో మిగిలిన సభ్యులకు సహాయం చేస్తారు.
నామినీకి ప్రయోజనాలు ఉన్నప్పటికీ జీవిత బీమా పాలసీ పొదుపుకు మంచిది కాదని చాలా మంది అంటారు.ఈ విధంగా జీవిత బీమా తీసుకున్నటువంటి వ్యక్తి మరణించినప్పుడు పూర్తి సహాయం చేస్తారని తెలియజేస్తారు.. పొదుపు పథకాలలో వచ్చిన మొత్తం వడ్డీతో చెల్లిస్తారు. జీవిత బీమా పాలసీలో ఒక వ్యక్తి బీమాను మాత్రమే పొందుతాడు.
ఒక వ్యక్తి పొదుపు పథకంలో భారీ మొత్తాన్ని పొందుతాడు. కుటుంబ సభ్యులు ఈ డబ్బులని వివిధ మార్కెట్ మాధ్యమాలలో పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశం. పొదుపు పథకంలో పెట్టుబడిదారుడు మెచ్యూరిటీ ప్రయోజనాన్ని పొందుతాడు. ఇలా జీవిత బీమా పొదుపు పథకంలో పెట్టుబడి పెట్టడానికి రెండు కూడా ఎంతో మంచివే. కనుక మీరు మీకు నచ్చిన దానిపై పెట్టుబడులు పెట్టి డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.