కేంద్ర పభుత్వం అదిరిపోయే స్కీమ్.. ఆ స్కీమ్ ద్వారా ఏకంగా రూ.30 వేలు పొందే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అమలు చేస్తూ ఆ పథకాల వల్ల ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం సూర్య ఘర్ ముక్త్ బిజిలి యువజన పథకం కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీ ధరతోనే సోనాల్ ప్యానెల్స్ ను కచ్చితంగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ స్కీమ్ ద్వారా అర్హత ఉన్న లబ్ధిదారులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలిగే అవకాశం అయితే ఉంది. అర్హత ఉన్న లబ్ధిదారులు ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీ ధరతోనే సోలార్ ప్యానల్ లను కొనుగోలు చేయవచ్చు. దేశంలో బొగ్గు నిల్వలు అంతకంతకూ తగ్గుతున్న నేపథ్యంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్తు అవసరాలకు సంబంధించి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

ఈ స్కీమ్ సహాయంతో వినియోగదారులు నాణ్యమైన విద్యుత్ పొందే అవకాశాలు అయితే ఉంటాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలు ఒక కిలో వాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానల్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

సాధారణంగా సోలార్ ప్యానల్ ను కొనుగోలు చేయాలంటే 60,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ స్కీమ్ కోసం కేంద్రం సబ్సిడీ రూపంలో 30,000 రూపాయలు అందించనుంది. ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందాలని భావించే వాళ్లు పీఎం సూర్యఘర్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.