ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏమి ఉండాలో తెలుసా?

మనం ఉండే నివాసంలో అనవసరంగా సమస్యలు రావడం, చిన్న చిన్న విషయాలకే కోపాలు, చిరాకులు, ఇంట్లో ఉంటే మనశ్శాంతి గా ఉండకపోవడం. ఎల్లప్పుడూ ఏదో కోల్పోయాము అన్న ఫీలింగ్ మనలో కలగడం. ఏ పని మొదలుపెట్టిన అవుతుందో కాదో అనే భ్రమలో ఆ పని చేయడం. ఇంట్లో ఏమైనా చేయాలంటే ఉత్సాహం లేకపోవడం. అభివృద్ధి అనేది లేకపోవడం. ఏ పని చేయాలి అనిపించకపోవడం. ఇట్లాంటివి అన్నీ ఎక్కడ ఉంటే అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లే.

మరి నెగటివ్ ఎనర్జీ లేనిచోట మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం గుడికి వెళ్ళినప్పుడు అన్నీ మర్చిపోయి మన ధ్యాస అంతా ఆ వాతావరణంతో ముడి పడుతుంది. అంటే అక్కడ నెగటివ్ ఎనర్జీ లేదు అని అర్థం. ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉండాలనిపించదు. ఎప్పుడెప్పుడు అక్కడ్నుంచి వెళ్లిపోదామా అని అనిపిస్తుంది అంటే అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం. మరి ఇలాంటి నెగటివ్ ఎనర్జీ గల ముఖ్య కారణాలు ఏమిటి అని చూసుకుంటే ఇంట్లో పరిశుభ్రత లేకపోవడం.

ఇంట్లో ముఖ్యంగా మొదటగా దేవుని గది, దేవుని పటాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే అక్కడ మనం పూజించే దేవుళ్ళు కొలువై ఉంటారు.రెండవ విషయం కిచెన్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం తినే ఆహారం వంటభడుతుంది. మూడవ విషయం టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చక్కగా ఈ మూడు విషయాలను పాటించినట్లయితే అక్కడ నెగటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండే ఆస్కారం ఉండదు.

ఈ మూడు విషయాలను పాటిస్తూ ఆ ఇంట్లో హనుమంతుని ఫోటోలు లేదా విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. లేదంటే రామున్ని కూడా స్మరించుకోవచ్చు. రాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడే ఉంటాడు కాబట్టి శుభంగా రాముని పూజించుకోవచ్చు. పరిశుభ్రత, శుద్ధి ఉన్నచోట నెగటివ్ ఎనర్జీ కచ్చితంగా ఉండదు. 40 రోజులు క్రమం తప్పకుండా ఇవి పాటిస్తే ఇంట్లో నుంచి నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోయింది అన్న విషయం మనకు అర్థమవుతుంది.