సాధారణంగా పురుషులు స్త్రీల నుంచి కేవలం శారీరక వాంఛ, శృంగారాన్ని మాత్రమే కోరుకుంటారని చాలామంది భావిస్తుంటారు. ఆ విధంగానే మనకు సినిమాల్లోనూ ఎక్కువగా చూపిస్తుంటారు.పురుషులు స్త్రీల నుంచి కోరుకునేది కేవలం శారీరక తృప్తి, శృంగారం మాత్రమే కాదు అంతకు మించినవి చాలా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. పురుషులు స్త్రీలను కేవలం కామ వాంఛతోనే చూస్తుంటారని అందరూ అనుకుంటారు అది పొరపాటే స్త్రీల నుంచి చాలా పొందడానికి పురుషుడు తెగ ఆరాటపడుతుంటాడు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పురుషులు స్త్రీల నుంచి శృంగారం కంటే కూడా గౌరవాన్ని ఎక్కువగా కోరుకుంటారు. తనను గౌరవించే స్త్రీకి పురుషుడు అన్ని విధాల అండగా ఉంటూ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయం చేయడానికి నిరాకరించడు.ముఖ్యంగా భార్య భర్తను గౌరవపదంగా చూసుకుంటే భార్యా పట్ల అమితమైన ప్రేమానురాగాలు చూపిస్తూ జీవితాంతం ఎంతో నమ్మకంగా ఉంటాడు. అలాకాకుండా స్త్రీలు పురుషులని అగౌరవపరిస్తే పురుషులు ఏమాత్రం సహించలేరు.
సాధారణంగా మగవారు తమ భార్యను సమాజంలో ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా చూడాలనుకుంటాడు. అవసరమైతే తన ఎదుగుదలకు కూడా కృషి చేస్తాడు అలా కాకుండా భర్తను అగౌరవిస్తూ ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకుంటూ గట్టిగా అరుస్తూ ఉండే భర్తలు అసలు సహించరు ఆమెను ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా పెట్టడానికి ఆలోచిస్తారు.ఒక్కోసారి విడాకుల తీసుకోవడానికి కూడా వెనకాడరు.
మగవారు ఎప్పుడు తన భార్య అందరికంటే అందంగా ఉండాలని కోరుకుంటాడు. అమితంగా ప్రేమించాలనుకుంటాడు. ఆలక్షణాలు లేని స్త్రీలను ఎక్కువగా ద్వేషిస్తాడు.పురుషులు తమ లక్ష్యాల గురించి ఇతర వ్యక్తులతో మాట్లాడటం చాలా అరుదనే చెప్పాలి. తన ఆశలు, కలల గురించి మీకు చెబితే, మిమ్మల్ని మీవారు ప్రత్యేకంగా చూస్తున్నారనీ అర్థం చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య ఆకర్షణ ,శారీరక సుఖం తోపాటు ప్రేమానురాగాలు, గౌరవం, నమ్మకం ఉన్నప్పుడు ఆ బంధం దృఢంగా ఎక్కువ కాలం సాఫీగా సాగిపోతుంది.