సాధారణంగా ప్రతి ఒక్కరికి కలలు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మంచి కలలు వస్తుంటే మరికొన్ని సందర్భాలలో పీడకలలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో కలలో దేవుడి దర్శనం చేసుకున్నట్లు అనిపిస్తుంది. అలాగే మరికొన్ని సందర్భాలలో ఎవరైనా కుటుంబ సభ్యులు బంధువులు లేదా తెలిసిన వ్యక్తులు మరణించినట్లు వారి శవాలు కలలో కనిపిస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం ఇలా శవాలు కలలో కనిపించటం వల్ల ఎటువంటి పరిణామాలు జరుగుతాయి. ఇలా కలలో శవాలు కనిపించటం దేనికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మన హిందూ సంస్కృతిలో స్వప్న శాస్త్రానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మన జీవితంలో జరగబోయే సంఘటనల గురించి ముందే ఇలా కలల రూపంలో సంకేతాలు తెలుస్తూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో వచ్చే కలలు భయభ్రాంతులకు గురిచేస్తాయి. కొన్ని సందర్భాలలో నిద్రపోతున్నప్పుడు కలలో శవాలు కనిపిస్తాయి. ఇలాంటి కలలు వచ్చినప్పుడు సాధారణంగా అందరూ చాలా భయపడతారు. ఎందుకంటే ఇలా కలలో శవం కనిపిస్తే చెడు జరుగుతుందని భావిస్తారు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో శవం కనిపిస్తే శుభ సూచికంగా చెబుతారు.
ఒక వ్యక్తి కలలో శవాన్ని చూస్తే అది అతనికి మంచి సంకేతమని చెబుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి కలలో శవంకనిపిస్తే ఆ వ్యక్తి త్వరలోనే వ్యాధి నుంచి విముక్తి పొందుతాడని అర్థం.
అలాగే వ్యాపారాలు చేసెవ్యక్తులకు కలలో శవాలు కనిపించటం కూడా శుభ సూచికగా భావించవచ్చు. ఇలా కల రావటం అనేది వ్యాపారంలో లాభాలు పొందుతారని తెలిపే సంకేతం. మీ కలలో మీరు ఎప్పుడైనా శవాన్ని చూసినట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. బదులుగా ఈ కల మీకు చాలా పవిత్రమైనదని, త్వరలో మీకు మంచి జరుగుతుందని భావించి సంతోషించాలి.