దక్షిణ రైల్వే నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. దక్షిణ రైల్వే తాజాగా నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేయగా జూన్ నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం 28 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. బీఎస్సీ నర్సింగ్ చదివిన విద్యార్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
https://rrcmas.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఏకంగా నెలకు 45,000 రూపాయల రేంజ్ లో వేతనం లభించనుంది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.
దక్షిణ రైల్వే ఈ మధ్య కాలంలో వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చుతోంది. భారీ మొత్తంలో వేతనం ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు