మీలో మతిమరుపు సమస్య తలెత్తడానికి అసలు కారణాలేంటో తెలుసా?

ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యఎల్లో మతిమరుపు సమస్య కూడా ప్రధానమైనది అని చెప్పొచ్చు.దీన్ని అల్జీమర్ వ్యాధి అని కూడా అంటారు. మతిమరుపు వ్యాధి కూడా ఓ రకమైన మానసిక రుగ్మతే దీనికి ప్రధాన కారణం క్రమ పద్ధతిలేని జీవన విధానం ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలను ప్రధానంగా చెప్పొచ్చు. మతిమరుపు వ్యాధి బారిన ఒకసారి పడితే వ్యాధిని నియంత్రించడం ఈ వ్యాధి నుంచి బయటపడడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడాలంటే చిన్నప్పటి నుంచి నియమ నిబద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకుంటే సరిపోతుంది.

మానసిక ఆనందాన్ని పెంపొందించుకొని మతిమరుపు సమస్య నుంచి బయట పడాలంటే ముందుగా మెదడు చురుకుతనాన్ని తగ్గించి ఆలోచన శక్తిని మందగింపజేసే ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అలాగే రోజువారి ఆహారంలో మెదడు కండరాలను దృఢంగా ఉంచి నాడీ కణ వ్యవస్థను అభివృద్ధిపరిచే పోషక విలువలు సమృద్ధిగా కలిగిన కాయగూరలు, పండ్లు, చేపలు, చిరుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటివి రోజు వారి ఆహారంలో ఎక్కువగా ఉండునట్లు చూసుకోవాలి. ముఖ్యంగా శరీర జీవక్రియలను మందగింపజేసే చెడు కొలెస్ట్రాల్ కలిగిన ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింకు వంటి వాడికి దూరంగా ఉండాలి.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు.మనలో ఒత్తిడిని తగ్గించి మెదడు చురుగ్గా పనిచేయ డానికి కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక , యోగ వంటివి తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. అధిక ఒత్తిడి సమస్య ఉన్నప్పుడు మానసిక ఆనందాన్ని పొందడానికి మీకు ఇష్టమైన సంగీతం, ఆర్ట్స్, డాన్స్ , గార్డెనింగ్ వర్క్ వంటివి అలవాటు చేసుకుంటే ఒత్తిడి ఆందోళన సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. మానసిక ఒత్తిడికి మరో ముఖ్య కారణం నిద్రలేమి సమస్య. మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే తప్పనిసరిగా 8 గంటల నిద్ర అవసరం. రాత్రిళ్ళు ఒంటిగంట వరకు మేల్కొని సెల్ ఫోన్, కంప్యూటర్ల ముందు కాలక్షేపం చేస్తే తీవ్రమైన మానసిక రుగ్మతలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.