సాధారణంగా యుక్త వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో శృంగారం ఎంతో కీలకం. శృంగారం భార్యాభర్తల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలను పెంచుతుంది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలోను శృంగారం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే పలు అధ్యయనాల ప్రకారం ఎక్కువ కాలం సెక్స్ లో పాల్గొనకపోయినా ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి సెక్స్ లో పాల్గొనకపోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
పెళ్లయిన అనంతరం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇప్పుడప్పుడే పిల్లలను వద్దనుకుంటే అలాంటివారు శృంగారానికి దూరంగా ఉండటం వల్ల గర్భధారణ కలుగుతుందనే ఆలోచనల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే పిల్లలు వద్దనుకోవడానికి ఎన్నో జనాల నియంత్రణ మార్గాలు ఉన్నప్పటికీ శృంగారానికి దూరంగా ఉండటం వల్ల 100% గర్భం కలిగే అవకాశాలు ఉండవు. తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల కొన్ని సార్లు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ల బారీన పడుతుంది.
అయితే శృంగారానికి దూరంగా ఉండటం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చు.
ఈ విధంగా శృంగారానికి దూరంగా ఉండటం వల్ల మీరు ఏ విధమైనటువంటి భావోద్వేగ సమస్యలపై దృష్టి పెట్టడానికి మీకు తగినంత సమయం ఉంటుంది. అనారోగ్యం లేదా వైద్యం తర్వాత.. సెక్స్ లో పాల్గొనకుండా ఉండాల్సి వస్తుంది.ఇలా శృంగారానికి దూరంగా ఉండటం వల్ల మీరు అనారోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవడానికి వీలు కలుగుతుంది. అయితే ఎవరైతే లైంగికంగా చురుగ్గా ఉంటారో అలాంటివారు ఎక్కువ రోజులపాటు శృంగారానికి దూరంగా ఉంటే నిరాశ పడతారు. కానీ కొంతకాలం పాటు శృంగారానికి దూరంగా ఉండటం వల్ల వ్యక్తిగత అభివృద్ధి స్వీయ-ప్రేమకు ఒక మంచి అవకాశాన్ని కలిగి ఉంటుంది.