ప్రస్తుత కాలంలో బల్లులు, బొద్దింకల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇతర కాలాలతో పోల్చి చూస్తే వేసవి కాలంలో బల్లులు, బొద్దింకల వల్ల మరింత ఎక్కువగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కొన్ని సింపుల్ చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. వెల్లుల్లి పాయల తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, లవంగాలు వేసి దంచి కాటన్ క్లాత్ లో ఉంచి చిన్నపాటి మూటగా కట్టుకోవాలి.
బొద్దింకలు, బల్లులు తిరిగే చోట ఈ చిన్నపాటి మూటలను ఉంచడం ద్వారా వాటి స్మెల్ కు బొద్దింకలు, బల్లులు పరారయ్యే అవకాశాలు ఉంటాయి. తలుపు దగ్గర, కిటికీ దగ్గర గుడ్ల పెంకులను ఉంచితే ఆ వాసనకు బల్లులు ఇంట్లోకి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. గది ఉష్ణోగ్రత 22 డిగ్రీల కంటే తక్కువగా ఉండేలా చూసుకుంటే బల్లులు అక్కడికి వచ్చే అవకాశాలు అయితే తగ్గుతాయని చెప్పవచ్చు.
వెల్లుల్లి, ఉల్లి రసాన్ని గోడలపై స్ప్రే చేయడం ద్వారా కూడా బల్లులు, బొద్దింకలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. బల్లులపై చల్లని నీటిని చల్లితే అవి అక్కడినుంచి పారిపోతాయి. మిరియాల పొడి, కారం పొడిని నీటిలో కలిపి బల్లులు ఎక్కువగా కనిపించే చోట స్ప్రే చేయడం ద్వారా కూడా బల్లులు, బొద్దింకలను ఇంట్లో నుంచి సులువుగా తరిమేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
బల్లులు వచ్చే ప్రదేశాలలో కూడా కాఫీ నీటిని స్ప్రే చేయడం కాఫీ పౌడర్ చల్లడం ద్వారా కూడా బల్లుల సమస్య సులువుగా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. నాఫ్తలిన్ గుళికలను అక్కడక్కడ వేయటం వల్ల బల్లులను నివారించే అవకాశాలు ఉంటాయి. దోమల కోసం ఉపయోగించే స్ప్రేలు కూడా బల్లుల నుండి రక్షించడంలో ఎంతగానో తోడ్పడతాయని చెప్పవచ్చు.