సాధారణంగా మన జీవితంలో మనం తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. మనం తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లే మన జీవితంలో పెద్ద సమస్యలను సృష్టిస్తాయి. అలా పొరపాట్ల మీద పొరపాట్లు చేసుకుంటూ పోవడం వల్ల భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రం ప్రకారం చేతుల నుంచి కొన్ని వస్తువులు జారి పడిపోవడం అశుభకరమైనదిగా భావిస్తారు. ఏ వస్తువులు మన చేతి నుండి జారిపోతే అశుభంగా భావిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఉప్పు : ప్రతి ఇంట్లో ఉప్పు కచ్చితంగా ఉంటుంది. ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల గృహప్రవేశం చేసేటప్పుడు మొదటగా ఉప్పుని ఇంట్లోకి తీసుకువెళ్తారు. అయితే కొన్ని సందర్భాలలో పొరపాటున చేయి జారి ఉప్పు కింద పడిపోతుంది. అల ఉప్పు పడిపోతే రాబోయే కొద్ది రోజుల్లో డబ్బు కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుంది.
పాలు : పొరపాటున చేతి నుంచి పాలు కింద ఒలకడం కూడా మంచిది కాదు. చేతిలో నుంచి పాలు పడితే కుటుంబంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటాయి. అలాగే కుటుంబంలో గొడవలు ప్రారంభం అవుతాయ.
ధాన్యాలు : వాస్తు శాస్త్రం ప్రకారం బియ్యం, గోధుమ వంటి ధాన్యాలు చేయి జారి కిందపడటం కూడా ఆశుభంగా భావించవచ్చు. ఒకరి చేతి నుంచి ధాన్యం కిందపడితే అన్నపూర్ణ తల్లికి అవమానంగా పరిగణించాలి.
నల్ల మిరియాలు : నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పొరపాటున ఇవి చేయి జారీ కింద పడిపోవడం అంటే కుటుంబసభ్యులు రాబోయే రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది.
పూజా ఫలకం : పూజా ఫలకం పడిపోవడం కూడా మంచి శకునం కాదని పురాణాల్లో పేర్కొన్నారు. ఇది కుటుంబంలో పెద్ద సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉంటుంది.