రైతులకు అలర్ట్.. ఈ వెల్లుల్లిని పండిస్తే మాత్రం లక్షల్లో లాభాలు పొందే ఛాన్స్!

మనలో చాలామంది వెల్లుల్లి అనగానే తెల్ల రంగులో ఉండే వెల్లుల్లి మాత్రమే గుర్తుకొస్తుందని చెబుతారు. అయితే ఈ వెల్లుల్లి కంటే పింక్ వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ను సులువుగా పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రైతులు ఎవరైతే పింక్ వెల్లుల్లిని సాగు చేస్తున్నారో వాళ్లు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

పింక్ వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉండటంతో పాటు ఈ వెల్లుల్లిని సులువుగా నిల్వ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వెల్లుల్లి ఏకంగా సంవత్సరం పాటు నిల్వ ఉండటం వల్ల ఈ వెల్లుల్లి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ వెల్లుల్లి సాగు చేయడం వల్ల మరింత ఎక్కువ మొత్తం లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. బీహార్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ సాబోర్ ఈ రకం వెల్లుల్లిని తయారు చేయడం గమనార్హం.

ఈ వెల్లుల్లి సల్ఫర్, యాంటీ ఆక్సిడెంట్లను ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. తొమ్మిది సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి ఈ వెల్లుల్లిని తయారు చేశారు. సబర్1 పేరుతో మార్కెట్ లోకి రానున్న ఈ వెల్లుల్లిని సాగు చేస్తే రైతులు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. విదేశీ మార్కెట్లలో కూడా ఈ వెల్లుల్లికి డిమాండ్ ఉందని సమాచారం.

ఈ వెల్లుల్లిలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందని సమాచారం అందుతోంది. పింక్ వెల్లుల్లి సాగు విషయంలో ఎక్కువ ఇబ్బందులు ఉండవని సమాచారం. ఈ వెల్లుల్లికి ఎక్కువ తెగుళ్లు వచ్చే అవకాశం అయితే లేదని బోగట్టా. పింక్ వెల్లుల్లిని సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులను సులువుగా పొందే అవకాశం ఉంటుంది.