సాధారణంగా ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలి అంటే వారి కుటుంబంలోని అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేస్తారు పెళ్లి విషయంలో ముఖ్యంగా అమ్మాయి అబ్బాయిల జాతకాలు చూడటమే కాకుండా ఇద్దరికి వయసులో ఎంత వ్యత్యాసం ఉందే అనే విషయాలను కూడా ముందుగా పరిశీలిస్తారు. సాధారణంగా మన సాంప్రదాయాల ప్రకారం వధువు కన్నా వరుడు వయసులో పెద్దగా ఉండాలని కోరుకుంటారు. అందుకే అబ్బాయి అమ్మాయి కన్నా పెద్ద వాళ్ళు అయితేనే పెళ్లి చేయడానికి ఆసక్తిగా చూపిస్తారు.
వివాహం చేసుకొని విషయంలో అమ్మాయి అబ్బాయి మధ్య వయస్సు వ్యత్యాసం కచ్చితంగా ఉండాలని చెబుతుంటారు.సాధారణంగా ఎక్కువ మంది ఇద్దరి మధ్య రెండు సంవత్సరాలు గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. కారణం ఇద్దరూ ఒకేలాగా ఆలోచిస్తారు కాబట్టి జీవిత ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం భార్యాభర్తల మధ్య 5-6 సంవత్సరాల గ్యాప్ ఉన్న జంట మధ్య వచ్చే గొడవలు, అపార్థాలు తక్కువగా ఉంటాయని తేలింది.
ఇలా వయసులో భార్య కన్నా భర్త ఐదు సంవత్సరాలు పెద్దవారు అయితే వారి ఆలోచనలు వారి నిర్ణయాలు సరైనవిగా ఉంటాయని పలు సర్వేలు తెలియజేస్తున్నాయి.అందుకే భార్య భర్తలు వారి జీవితంలో సంతోషంగా ముందుకు కొనసాగాలి అంటే భార్య కన్నా భర్త వయసు ఐదు సంవత్సరాలు పెద్దదై ఉండాలి ఇలా ఉన్నప్పుడే వారి మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావు వారి జీవితం సంతోషంగా ఉంటుంది.