కలయిక తర్వాత కౌగిలింతతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

దాంపత్య జీవితంలో ప్రేమ అనురాగాలతో పాటు శారీరక తృప్తి కి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. కలయిక సమయంలో శారీరక తృప్తి అనుభవించిన దంపతుల దాంపత్య జీవనం సాఫీగా సాగిపోవడమే కాకుండా మానసిక శారీరక ఆరోగ్యాన్ని కూడా పెంపొందుతుందని అనేక సర్వేల్లో వెల్లడింది. ఇప్పుడు చెప్పబోయే అంశం ఏమిటంటే. కొందరు దంపతులు ఏదో మొక్కుబడిగా సెక్స్ లో పాల్గొని అయిపోయిన వెంటనే లేచి ఒకరు అటు ఒకరు ఎటు తిరిగి పడుకోవడం లేదా బాత్రూంకి పరువు తీయడం వంటివి చేస్తుంటారు. అలా చేయడం వల్ల దంపతులు దాంపత్య జీవనంలో ఎన్నో సుఖాలను కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు.

దంపతుల కలయిక సమయంలో సంపూర్ణ ఆనందాన్ని పొందుతారు.సంభోగం తర్వాత ఒకరి నొకరు హత్తుకోవడం, కౌగిలించుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. సెక్స్ తర్వాత కౌగిలించుకోవడం అనేది మీ బంధాన్ని బలోపేతం చేయడానికి ఉత్తమమైన మార్గాలలో ప్రధానమైనది కాబట్టి సంభోగం అయిన వెంటనే ఏవో కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్టు లేచి వెళ్లకుండా ఒకరినొకరు గట్టిగా అతుక్కొని, కౌగిలించుకొని అలాగే కాసేపు పడుకోవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ శారీరక మానసిక ఆరోగ్యం కూడా పెంపొందుతుంది.

సంభోగం తర్వాత దంపతులిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని కాసేపు అలాగే పడుకోవడం వల్ల
శరీరంలో ఆక్సిటోసిన్ లేదా లవ్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. లైంగిక తృప్తి చెందిన సమయంలో దీని స్రావం పెరుగుతుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో ,మీ భాగస్వామి మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఆక్సిటోసిన్, ప్రేమ హార్మోన్ లేదా బాండింగ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు, భాగస్వాముల మధ్య సంబంధాలను పదిలంగా ఉంచడంలో ఈ హార్మోన్ ఎంతగానో తోడ్పడుతుంది. దంపతులు సంభోగం తర్వాత కాసేపు కౌగిలించుకొని హాయిగా అలాగే పడుకుంటే రక్తపోటును తగ్గించడంలో సహాయపడి గుండె జబ్బులకు సంబంధించిన ప్రమాదాలను తగ్గిస్తుందని ఓ అధ్యయనం చెబుతోంది.