ప్రేమ వివాహం చేసుకోవడం తప్పులేదు అలాగని మన బంగారు భవిష్యత్తు కోసం పాటుపడే తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోవడం సమంజసం కాదు. ఈ రోజుల్లో చాలా మటుకు ప్రేమ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నాయి. పెద్దలకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకునే ముందు అసలు మీ తల్లిదండ్రులు ఎందుకు ఈ వివాహానికి ఒప్పుకోవట్లేదు కారణాలేంటో ఒకసారి గమనించండి లేదా మీరు ఎందుకు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలంటున్నారు అర్థమయ్యే విధంగా మీ తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించే ప్రయత్నం చేయండి. మీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఈ విధంగా చేయండి.
మీరు ప్రేమ వివాహం చేసుకోవాలంటే మొదట మీ తల్లిదండ్రులు అడిగే ప్రతి ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉండాలి. ఆ అమ్మాయికి సంబంధించిన లేదా అమ్మాయి కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం మీరు క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి అప్పుడే మీ తల్లిదండ్రులకు ఖచ్చితమైన సమాధానం చెప్పగలరు.
తల్లిదండ్రులు ఎవరైనా మీ మంచినే కోరుకుంటారు కాబట్టి మొదట మీరు ప్రేమించిన విషయాన్ని మీ తల్లిదండ్రులకు కు చెప్పే ప్రయత్నం చేయండి.
ఎవరినైనా ఇష్టపడుతుంటే మొదట మీ తల్లిదండ్రులకు చెప్పి ఆ అమ్మాయి కుటుంబ వ్యవహారాలు ఆ అమ్మాయి గురించి తెలుసుకోమని చెప్పండి ఒప్పు కోకపోతే ఓర్పుగా పదేపదే చెబుతూ ఒప్పించే ప్రయత్నం చేయాలి.అంతేకానీ వారిని బాధపెట్టే పనులు అస్సలు చేయకండి.
మీ పెద్దవారు ఎన్నిసార్లు చెప్పినా ఒప్పుకోకపోతే మీ సమీప నమ్మకమైన బంధువులను లేదా స్నేహితుల సహాయం తీసుకోండి తప్పేం లేదు. వీలైతే మీరు ప్రేమించిన అమ్మాయిని మీ తల్లిదండ్రులు కలిసే ఏర్పాట్లు చేయండి.
ఒకవేళ మీ పెద్దవారు మీ ప్రేమ వివాహాన్ని ఒప్పుకోకపోతే ఎందుకు ఒప్పుకోలేదు దానికి గల కారణాలను తెలుసుకోండి, వారిలో ఉన్న సందేహాలను భయాలను తొలగించడానికి మీకు అవకాశం ఏర్పడుతుంది.
ఎంతసేపు మీ ధోరణిలోనే ఆలోచించకుండా ఒకసారి మీ పెద్దవారి ప్లేస్ లో మీరు ఉంటే ఏం చేస్తారు వంటి విషయాలు కూడా క్షుణ్ణంగా ఆలోచించండి అప్పుడే ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది.