మీకు ఏటీఎం కార్డు ఉందా అయితే మీకు ఇది శుభవార్త. ఏటీఎం కార్డు ఉంటే చాలు 50 వేల నుంచి పది లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ పొందవచ్చు. సదుపాయాన్ని ఇస్తోంది. అలానే క్రెడిట్, డెబిట్ కార్డులతో షాపింగ్ చేస్తే డిస్కౌంట్లను పొందొచ్చు. ఏటీఎం కార్డు ఉన్న వారికి బ్యాంకులు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.అయితే ఈ విషయాన్ని ఏ అధికారులు మనకు తెలియజేయరు. కానీ అకౌంట్ హోల్డర్స్ ఈ విషయాన్ని తెలుసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఇలా ఏటీఎం కార్డు కలిగిన వారికి ఈ అవకాశం రావాలంటే ఏటీఎం కార్డు వేరియంట్, కస్టమర్ టూ కస్టమర్ ట్రాన్సాక్షన్‌ని బట్టి ఇన్సూరెన్స్ కవరేజీ ఇస్తారు.
యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్, యాక్సిడెంటల్ డెత్ కవరేజ్‌ని ఇస్తున్నాయి. అయితే ఈ ఫెసిలిటీ పొందాలంటే తప్పనిసరిగా ఏటీఎం ఉన్న అకౌంట్ యాక్టివ్ గా ఉండాలి. అయితే అకౌంట్ యాక్టివ్గా లేని పక్షంలో బ్యాంకులో తమ ఇన్సూరెన్స్ ను ఉపసంహరించుకుంటాయి.
ఎవరైనా ప్రమాదం బారిన పడితే మెడికల్ రికార్డులను ఇవ్వాలి. వీటిని పరిశీలించి బ్యాంకు నిర్ణయం తీసుకుంటుంది. దురదృష్టవశాత్తు ప్రమాదం బారిన పడితే డెత్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. బాధితుడికి పోస్టుమార్టం రిపోర్ట్ తో పాటు అదేవిధంగా వారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా సమర్పించాలి. వీటితోపాటు రెండు నెలలు ఏటీఎం ట్రాన్సాక్షన్ కి సంబంధించిన మినీ స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.