దేశంలోని అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా మహిళలు ఎదుగుతున్న సంగతి తెలిసిందే. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ మహిళల కొరకు స్పెషల్ సేవింగ్స్ అకౌంట్ ను అందిస్తోంది. ఈ బ్యాంక్ లో మహిళలకు ఏకంగా 7 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయాలంటే కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఈ బ్యాంక్ అకౌంట్ తీసుకున్న మహిళలకు రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ లభిస్తుంది.
ఎవరైతే ఈ ఏటీఎం కార్డ్ ను కలిగి ఉంటారో వాళ్లు 40,000 రూపాయల వరకు ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఏటీఎం కార్డ్ ద్వారా ఉచితంగా 20 లావాదేవీలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఈ డెబిట్ కార్డును కలిగి ఉంటారో వాళ్లు వేర్వేరు డిస్కౌంట్లను కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు 2 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా కలిగి ఉంటారు.
ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ ఎలాంటి మినిమం బ్యాలెన్స్ అవసరం లేకుండా ఈ బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. ఈ బ్యాంక్ లో బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆరు నెలలకు ఒకసారి ఉచితంగా బ్యాంక్ స్టేట్మెంట్ ను పొందవచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరు ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఆధార్, పాన్ కార్డ్ ఉన్నవాళ్లు ఈ బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు.
ఈ బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉండాలంటే 10,000 రూపాయల మినిమం బ్యాలెన్స్ ఉండాలి. ఈ మొత్తం లేకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుంది. దేశంలోని చాలా బ్యాంకులు మహిళలకు ప్రత్యేకమైన బెనిఫిట్స్ ను అందిస్తున్నాయి.