కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండడం కోసం ఎన్నో రకాల పథకాలను అమలులోకి తీసుకు వచ్చింది.ఇలా సరికొత్త పథకాల ద్వారా మనం పెట్టుబడి పెట్టి భవిష్యత్తులో ఆ డబ్బులు పెన్షన్ రూపంలో పొందేలా ఎన్నో రకాల పథకాలను అమలులోకి తీసుకువచ్చారు అయితే తాజాగా సరికొత్త పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురానుంది. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే చాలు ప్రతినెలా 3000 రూపాయల పెన్షన్ పొందవచ్చు. మరి ఆ స్కీమ్ ఏంటి ఎలా నెలకు 3000 పెన్షన్ పొందవచ్చు అనే విషయానికి వస్తే…
కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన ఈ స్కీమ్ పేరు శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన. ఈ స్కీమ్ తో ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు ఈ స్కీం ద్వారా ప్రతి ఏటా 30 వేల రూపాయలను పొందవచ్చు అయితే ఈ పథకానికి అందరూ అర్హులు కారు. కేవలం
అసంఘటిత రంగంలోని కార్మికులకు మాత్రమే. వీధి వ్యాపారులు, రిక్షా తోలే వారు, తయారీ రంగంలోని కార్మికులు, ఇతర రంగాల్లోని కార్మికులు ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఈ బెనిఫిట్స్ ని పొందొచ్చు. దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ స్కీమ్ లో చేరచ్చు. ప్రత్యేకమైన పోర్టల్‌ను అందుకు అందుబాటులో వుంది.
ఈ స్కీమ్ లో చేరాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా అవసరమవుతుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా కావాలి. ఈ స్కీమ్ లో చేరాలి అంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు. ఈ స్కీమ్ లో చేరిన వారు ప్రతి నెల 55 రూపాయల నుంచి పెట్టుబడిగా పెట్టుకోవచ్చు ఇలా నెలకు 55 రూపాయలు కడితే మెచ్యూరిటీ కాలం పూర్తి అయిన తర్వాత ప్రతి నెల 3000 రూపాయల పెన్షన్ పొందవచ్చు. 40 ఏళ్ల వయసులో ఉన్న వరు నెలకు రూ .200 చెల్లించాల్సి వుంది. నెలకు రూ. 3 వేలు వస్తాయి. 60 ఏళ్లు నిండిన తర్వాతి నుంచి మూడు వేలు వస్తాయి. నెలవారీ ఆదాయం రూ. 15 వేలకు లోపు ఉంటేనే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందేందుకు అవుతుంది.