ఇంట్లో బొద్దింకల సమస్య వేధిస్తోందా? వీటిని తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు మీకోసమే!

మన సంపూర్ణ ఆరోగ్యానికి బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుంటే సరిపోదు. మన ఇల్లు ఇంటి పరిసరాలు కూడా ఎంతో శుభ్రంగా ఉండాలి అప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. మన ఇంట్లో తడి ప్రదేశాల్లో ఎక్కువగా నివసించే బొద్దింకలు దోమలు వంటి కీటకాలు మనలో తీవ్ర అనారోగ్య కారకాలకు కారణం కావచ్చు.వీటి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.ముఖ్యంగా బొద్దింకలు ప్రత్యక్షంగా మనకు హాని కలిగించకపోయిన పరోక్షంగా వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్ పంటి సూక్ష్మజీవులకు వాహకాలుగా పనిచేసే మనలో డయేరియా, టైఫాయిడ్, విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి.

బొద్దింకలు తడి వాతావరణం కలిగిన వంటగది, బాత్ రూమ్, సింక్ వంటి ప్రదేశాల్లో ఎక్కువగా నివసిస్తాయి. అక్కడినుంచి వ్యాధి కారకాలను మోసుకొచ్చి మనం తినే ఆహార పదార్థాల పైన బొద్దింకలు తిరిగినప్పుడు ఫుడ్ పాయిజన్ జరిగి మనలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బొద్దింకలను ఇంటి పరిసరాల నుంచి తరిమికొట్టడానికి ఎటువంటి రసాయనాలు వాడకుండా కొన్ని చిన్నపాటి ప్రయత్నాలతోనే మంచి ఫలితం పొందవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. వంటింట్లో బొద్దింకల గోల ఎక్కువగా ఉంటే బోరిక్ పౌడర్, చక్కర ,గోధుమపిండి మిశ్రమంతో చిన్న ఉండలు చేసి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో ఉంచితే బొద్దింకలు వాటిని తిని చనిపోతాయి.

నీటిలో అమోనియం మిశ్రమాన్ని కలిపి బొద్దింకలు ఎక్కువగా నివసించి వాష్ బేసిన్, వంటగది, బాత్రూంలో అప్పుడప్పుడు చల్లుతూ ఉంటే బొద్దింకల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. బిర్యానీ ఆకుల పొడిని బొద్దింకలు తిరిగే ప్రదేశంలో ఉంచితే బొద్దింకలు అక్కడ్నుంచి పారిపోతాయి.బోరింగ్ పౌడర్ చక్కరను కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో ఉంచితే దాన్ని తిని బొద్దింకలు చనిపోతాయి. సబ్బు నీళ్లను బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో అప్పుడప్పుడు చల్లినా కూడా సమస్య కొంతవరకు తగ్గుతుంది.