డబ్బు సంపాదించడానికి, సంపాదించిన డబ్బు నిలుపుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మొదలుపెట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడి ఖర్చు ఎంత వృధాగా పోతే ఆ బాధ వర్ణనాతీతం. అనవసర ఖర్చులతో వచ్చిన డబ్బు వచ్చినట్టే తిరిగి వెళ్ళిపోతుంది. మనం సంపాదించిన డబ్బు మనతోనే ఉంటూ లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా చేస్తే చాలు.
మనం ఇండ్లలో తరచుగా వాడే కర్పూరంతో చక్కటి పరిష్కారం పొందవచ్చు. ముందుగా ఒక ఆకుపచ్చ డబ్బాను తీసుకోవాలి. అది మూడు అంగుళాలు ఉంటే సరిపోతుంది. ఆ ఆకుపచ్చ డబ్బాలో నిండుగా పచ్చ కర్పూరం బిళ్ళలను వేయాలి. తరువాత వాటిపై సువాసన కోసం రెండు మూడు బిళ్ళలను పొడి లాగా చేసి ఆ కర్పూరం పై వేసి గట్టిగా మూత పెట్టేయాలి.
ఇక ఆ కర్పూరం వ్యాపారస్తులు అయితే వారు బిజినెస్ చేసే ప్రాంతం శుభ్రం చేసుకుని ముఖ్యంగా డబ్బును పెట్టే గల్లా పెట్టే, టేబుల్ ర్యాకు, బీరువా లలో ఒక మూలన పెట్టేయాలి. ఇక దాని గురించి మరిచిపోయి ఆలోచించాల్సిన అవసరం లేదు. కర్పూరం అంటే లక్ష్మీదేవికి ప్రీతి. కనుక మీరు అక్కడ ఉంచిన డబ్బు అనవసరంగా బయటకు వెళ్లే ఆస్కారం ఉండదు. ఇక బాక్స్ ను గట్టిగా మూత పెట్టాము కాబట్టి కర్పూరము కరిగే పరిస్థితి ఉండదు.
ఒకవేళ ఇంట్లో ఉంచుకోవాలి అనుకుంటే బీరువాలో విలువైన వస్తువులు ఉంచే ప్రదేశంలో, లేదంటే బీరువాలో బట్టల పక్కన కూడా ఈ ఆకుపచ్చ బాక్సును ఉంచవచ్చు. ఇలా చేయడానికి మంచి రోజు అంటూ ఏమీ లేదు ఏరోజైనా కూడా చేయవచ్చు. ఇక దీనిని ఏ రోజు చేయాలనుకుంటామో ఆరోజు సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో చేయాలి. ఆ సమయం శివునికి ప్రీతి కాబట్టి ఆ సమయంలో చేస్తే మంచిది.
పెద్దగా ఆర్భాటాలు, పెద్దగా ఒత్తిడి తెచ్చుకోవాల్సిన పని లేకుండా సులువుగా ఇలా చేస్తే సంపాదించిన ధనం బయటకు పోకుండా ఇంట్లో అభివృద్ధి మెరుగ్గా ఉండి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు కొనసాగుతాయి. ఆర్థిక సమస్యలు వెంటాడవు.