మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయా.. తప్పనిసరిగా పాటించాల్సిన పరిహారాలు ఇవే!

మనలో చాలామంది భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నా ప్రశాంతత లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. మన దేశం శాస్త్రాలకు పుట్టినల్లు కాగా ఎవరి ఇంట్లో అయితే వాస్తు దోషాలు ఉంటాయో వాళ్ల ఇళ్లలో పనులు అనుకున్న విధంగా జరగవు. ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థికపరమైన సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.

అయితే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నంత మాత్రాన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులువుగా వాస్తు దోషాలు తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇంటిని నిర్మించే సమయంలో శాస్త్ర నియమాలకు అనుగుణంగా ఎవరైతే నిర్మించరో వాళ్లను ఈ తరహా సమస్యలు ఎక్కువగా వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.

ఎవరి ఇంట్లో అయినా వాస్తు దోషాలు ఉంటే మొదట ఇంటిని పూర్తిగా శుభ్రం చేస్తే మంచిది. ఆ తర్వాత పసుపు నీళ్లతో ఇంటిని శుభ్రపరచాలి. మనలో చాలామంది ఇంట్లో కిటికీలను ఎప్పుడూ మూసి ఉంచుతారు. ఈ విధంగా చేయడం వల్ల మనపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయి. పూజా స్థలంలో పాత పూలు, పండ్లు, ఇతర సామాగ్రి ఉంచితే చెడు ఫలితాలు కలుగుతాయి.

ఇంట్లో ప్రతిరోజూ శంఖం ఊదడంతో పాటు గంట కొడితే వాస్తు పరంగా అన్నీ అనుకూలంగా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంట్లో ఉత్తర దిశలో పచ్చని చెట్లు, పచ్చని మొక్కలు పెంచడం ద్వారా కచ్చితంగా అనుకూల ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇంట్లో స్పటిక శ్రీ యంత్రాన్ని ఉంచడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈశాన్య దిశలో చెత్త, బరువైన వస్తువులు ఉంచకూడదు.