రాత్రి సమయాల్లో ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి? ఆ పొరపాట్లే మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తాయి?

సుఖప్రదమైన నిద్ర మనలో ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగించడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది.అలాకాకుండా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే తీవ్ర మానసిక ఒత్తిడికి గురై అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కావున సుఖప్రదమైన నిద్ర కోసం రాత్రి సమయాల్లో మనం తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి లేకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తి నిద్రలేమి సమస్య, మానసిక ఒత్తిడి వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

రాత్రి భోజనంలో సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్య తలెత్తదు అలాకాకుండా అధిక కొవ్వు పదార్థాలు కలిగిన డైరీ ప్రొడక్ట్స్, రెడ్ మీట్, చాక్లెట్, పిజ్జా ,బర్గర్ అధిక మసాలాలు కలిగిన ఫాస్ట్ ఫుడ్ ,జంక్ ఫుడ్ ను ఎక్కువగా తింటే జీర్ణం అవడంలో సమస్య తలెత్తి కడుపులో మంట, అజీర్తి ,గ్యాస్టిక్ సమస్యలతో నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన రాత్రి పూట మూత్రం విసర్జించడానికి ఎక్కువసార్లు లేవాల్సి ఉంటుంది తద్వారా నిద్ర భంగం కలిగి నిద్రలేమి సమస్యతో బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు, అతిమూత్ర వ్యాధి ఉన్నవారు నీరు ఎక్కువగా ఉండే కీరదోస, పుచ్చకాయ వంటి వాటిని తక్కువగా తినడమే మంచిది.

రాత్రి సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీ టీ వంటి పానీయాలను సేవించవద్దు. ఇందులో ఉండే కెఫిన్ అనే ఆల్కలాయిడ్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపి నిద్రలేమి సమస్యను కలిగిస్తుంది. గోరువెచ్చని పాలు సేవిస్తూ సుఖప్రదమైన నిద్ర కలుగుతుంది. అలాగే ఈ రోజుల్లో ఎక్కువమంది చేసే పొరపాటు రాత్రి సమయాల్లో మద్యం సేవించడం ఇది భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యగా మారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఆల్కహాల్ ధూమపానం వంటి అలవాట్లు ఉంటే నిద్ర సరిగా పట్టకపోగా మెదడు సంబంధిత రుగ్మతలు,గురక, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు తలెత్తి ఉదయాన్నే లేవడానికి బద్దకంగా ఉంది ఆ రోజంతా నిరుత్సాహం అలసట వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.