ఆస్తమా వ్యాధిగ్రస్తులు శీతాకాలంలో తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే!

శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు తడి వాతావరణం కారణంగా ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి ప్రమాదకర సూక్ష్మజీవుల తాకిడి ఎక్కువగా ఉండి మన ఇమ్యూనిటీ సిస్టం పై దాడి చేసి న్యుమోనియా సమస్యకు దారితీస్తుంది. ఫలితంగా అనేక శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆస్తమా సమస్య ఉన్న వారి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ శీతాకాలంలో ఆస్తమా, ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న వారు వ్యాధి తీవ్రతను తగ్గించుకోవడానికి రోజువారి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా ఆస్తమా సమస్యతో బాధపడేవారు శీతాకాలంలోనే కాదు ఎప్పుడైనా ధూమపానం, మద్యపానం తీసుకోవడం అత్యంత ప్రమాదకరమని గుర్తించి వాటికి దూరంగా ఉండటం మంచిది. శీతాకాలంలో వ్యాధి తీవ్రతను తగ్గించుకోవడానికి విటమిన్ సి విటమిన్ ఏ సమృద్ధిగా లభించే యాపిల్, బొప్పాయి, కివి, అవకాడో, జామా వంటి పండ్లతో పాటు ఉసిరి, క్యారెట్, బచ్చలి కూర, పాలకూర, చిలకడదుంపలు వంటివి రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే విటమిన్ డి సమృద్ధిగా లభించే పాలు, గుడ్లు, సముద్రపు చేపలు, గుమ్మడి గింజలు, చియా విత్తనాలను ఎక్కువగా తింటే ఆస్తమా సమస్య నుంచి బయటపడవచ్చు.

ఆస్తమా వ్యాధిగ్రస్తులు డైరీ ప్రొడక్ట్స్, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి.అంతేకాదు ఆస్తమా సమస్యతో బాధ పడుతున్న వారు అరటి పండ్లు, ఉల్లి, వెల్లుల్లి, క్యాబేజీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, వంటి వాటిని దూరం పెట్టాలి. ఇవి ఆస్తమా లక్షణాలను మరింత తీవ్ర తరంగా మారుస్తాయి.వారంలో మూడు సార్లు ఫాస్ట్ ఫుడ్ తినే తినే వారికి, ముఖ్యంగా చిన్నపిల్లలకు ఆస్తమాతో పాటు చర్మ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశముందని ఓ అధ్యయనంలో తేలింది.ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు స్టెరాయిడ్లు వాడాల్సి రావచ్చు. అయితే వాటిని వైద్యుల సలహా మేరకు మాత్రమే వేసుకోవాలి. అలాగే యోగ, వ్యాయామం, నడక వంటివి అలవాటు చేసుకుంటే మంచిది