భోజనం చేసేటప్పుడు పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఇవే?

సాధారణంగా ప్రతి ఒక్కరూ భోజనం చేసే సమయంలో వారికి ఎలా సౌకర్యంగా ఉంటే అలా భోజనం చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఎవరికి నచ్చినట్టు వారు భోజనం చేయడం ఏ మాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. భోజనం చేసే విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలను పాటించి చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకే భోజనం చేసేముందు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. అయితే భోజనం చేసేటప్పుడు మనం పొరపాటున కూడా తప్పులు చేయకూడదు. మరి ఆ తప్పులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా భోజనం చేసేటప్పుడు చాలామంది టీవీ ఏ దిక్కులో ఉంటే అటువైపుకు తిరిగి కూర్చుని భోజనం చేస్తుంటారు. ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు తూర్పు దిశ వైపు కూర్చొని భోజనం చేయడం మంచిది. ఎప్పుడూ కూడా కుర్చీలపై సోఫాలపై కూర్చుని అన్నం తినకూడదు శుభ్రంగా నేలపై కూర్చొని భోజనం చేయడం మంచిది. ఇక చాలామంది భోజనం చేసేటప్పుడు తిన్న చేతితోనే ఇతర ఆహార పదార్థాలను వడ్డించుకుంటారు ఇలా ఎంగిలి చేతితో ఆహార పదార్థాలను ఎప్పుడు వడ్డించుకోకూడదు.

ఇక చాలామంది టీవీ చూస్తూ గంటలు కొద్ది భోజనం చేస్తుంటారు. అయితే మనం తినేటప్పుడు మన దృష్టి మొత్తం భోజనం పై పెట్టి వెంటనే భోజనం పూర్తి చేయాలి. ఇక భోజనం చేసేటప్పుడు పొరపాటున కూడా ఇతరులపై కోపం ప్రదర్శించకూడదు. అలాగే ఇతరులను దూషించకూడదు. ఆహార పదార్థాలు రుచిగా లేవని చాలామంది మధ్యలోనే చేతిని కడుగుతుంటారు. ఇలా ఎప్పటికీ చేయకూడదు ఇలా చేయటం వల్ల అన్నపూర్ణ దేవి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. మరికొందరు తినే పళ్లెం విసిరి కొడుతూ ఉంటారు. ఇది కుటుంబానికి ఏమాత్రం మంచిది కాదు.అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి అన్నం రుచిగా లేకపోయినా ఆ పూటకు సర్దుకుని పోయి తినాలి కానీ ఎవరూ కూడా అన్నం విసరకూడదు. ఇలా ఈ తప్పులు చేయకుండా భోజనం చేయడం వాస్తు శాస్త్ర ప్రకారం ఎంతో శుభసూచికం.