ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. నౌకాశ్రయాలు, షిప్పింగ్, వాటర్ వేస్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మే నెల 20వ తేదీన అథారటీ ఈ నోటిఫికేషన్ ను జారీ చేయడం జరిగింది. సీనియర్ కన్సల్టెంట్ (కమ్యూనికేషన్), ఎగ్జిక్యూటివ్ (గ్రాఫిక్స్), ఎగ్జిక్యూటివ్ (కంటెంట్, సోషల్ మీడియా) జాబ్స్ ను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
iwai.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆఫ్ లైన్ మోడ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు నోయిడాలోని ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది.
ఈ మూడు ఉద్యోగ ఖాళీలను ఒక్కొక్కటి చొప్పున భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. సీనియర్ కన్సల్టెంట్ (కమ్యూనికేషన్) ఉద్యోగానికి 15 సంవత్సరాల అనుభవం కలిగి ఉండటంతో పాటు 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఎగ్జిక్యూటివ్ (గ్రాఫిక్స్) ఉద్యోగ ఖాళీలకు గ్రాఫిక్ డిజైనింగ్ విజువల్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి అనుభవం ఉన్న ఉద్యోగులు అర్హులు.
ఎగ్జిక్యూటివ్ (కంటెంట్ & సోషల్ మీడియా) ఉద్యోగాలకు కనీస వయస్సు 22 సంవత్సరాలు కాగా గరిష్ట వయస్సు 63 సంవత్సరాలుగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు కనీసం 50,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.