భార్యాభర్తలు కేవలం ఈ కారణాలతోనే తమ బంధాన్ని పాడు చేసుకుంటారని మీకు తెలుసా?

husband-wife-speak-after-fight-offended-married-couple_213607-1416

ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తమ బంధంలో సంతోషంగా కొనసాగుతూ ముందుకు వెళ్లాలి కానీ చిన్న చిన్న గొడవలు పడుతూ ఆ గొడవలను పెద్దది చేసుకుంటూ తమ బంధాన్ని ఎప్పుడు విచ్ఛిన్నం చేసుకోకూడదు.
వైవాహిక జీవితం ఎక్కువకాలం సుఖసంతోషాలతో కొనసాగుతుంది. అలాకాకుండా ఒకరినీ గురించి మరొకరు పట్టించుకోకుండా ఎవరికి తోచింది వారు చేసుకుంటూ వెళ్తే మీ దాంపత్య జీవనం స్వల్ప కాలంలోనే తనువు చాలించాల్సి ఉంటుంది.

భార్యాభర్త ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇద్దరి ఇష్ట అయిష్టాలు, ఆర్థికపరమైన అంశాలు, కుటుంబ వ్యవహారాల పట్ల ఇద్దరికీ అవగాహన వచ్చే విధంగా కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి.దాంపత్య జీవనంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఇద్దరు కలిసి సమస్యను పరిష్కరించుకున్నప్పుడు బంధం మరింత బలపడుతుంది. అలాకాకుండా మీ భాగస్వామి పట్ల చిరాకు,కోపం,అసహ్యం వంటి లక్షణాలను ప్రదర్శిస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తి తక్కువ కాలంలోనే విడాకులకు దారి తీయవచ్చు.

ఈ మధ్యకాలంలో భార్యాభర్తలిద్దరూ సంపాదనలో పడి ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు పూర్తిగా లేకుండా పోయాయి ఇక పడక గదిలో కూడా భార్య భర్తను దూరం పెట్టడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తుతూ గొడవలు రావడానికి కారణం అవుతున్నాయి. కాబట్టి పడక గదిలో మీ భాగస్వామితో ఏకాంతంగా ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి.సహజంగా దంపతులిద్దరూ వైవాహిక జీవితంలో ఎక్కువ సమయం ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు. ఇక భార్యాభర్తలిద్దరూ సంపాదనలో పడి సంపాదన విషయంలో నువ్వు ఎక్కువగా నేను ఎక్కువ అని పోటీ పడినప్పుడు కూడా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి బంధం చెడిపోవడానికి కారణమవుతుంది.అదేవిధంగా మీ వ్యక్తిగత విషయాలను ఇతర దగ్గర ప్రస్తావించినప్పుడు కూడా మీ బంధం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.