విద్యార్థులకు తపాలాశాఖ అదిరిపోయే తీపికబురు.. భారీ మొత్తంలో స్కాలర్ షిప్ పొందే ఛాన్స్!

మన దేశంలో సంవత్సరం సంవత్సరానికి ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఖర్చులు పెరుగుతున్న స్థాయిలో ఆదాయం పెరగడం లేదు. దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన స్కాలర్‌ షిప్‌ పేరుతో తపాలా శాఖ ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు స్కాలర్ షిప్ అందిస్తుండటం గమనార్హం. ఈ పరీక్ష ద్వారా విద్యార్థులకు సంబంధించి వేర్వేరు సబ్జెక్ట్ లలో జ్ఞానాన్ని పరీక్షించడం జరుగుతుంది.

అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోగా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులతో పాటు ప్రైవేట్ పాఠశాలలలో చదివే విద్యార్థులు సైతం ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. సంబంధిత రీజనల్ ఆఫీస్ కు పాఠశాల హెడ్ మాస్టర్ విద్యార్థుల పేరుపై విద్యార్థుల జాబితాను పంపాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.

సమీపంలోని పోస్టాఫీస్ లో ఫిలాటలీ క్లబ్‌ అకౌంట్‌ ను తెరిచి 200 రూపాయలు చెల్లించడం ద్వారా రూ.180 విలువ చేసే తపాలా బిళ్లలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో 50 ప్రశ్నలు అడుగుతారని తెలుస్తోంది. రెండు దశలలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.6 వేలు చెల్లించడం జరుగుతుంది.

ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థులు తపాలా శాఖలో తల్లీదండ్రుల పేర్లపై జాయింట్ అకౌంట్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ లో జమ అయిన మొత్తాన్ని ప్రతి 90 రోజులకు ఒకసారి విత్ డ్రా చేసుకోవచ్చు. నెలకు 500 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు జమవుతుంది. https://www.indiapost.gov.in/philately/pages/content/deen-dayal-sparsh-yojana.aspx వెబ్ సైట్ లింక్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.