కేంద్ర భద్రతా దళాల్లో మంచి ఉద్యోగం చేయాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా పది అర్హతతో సీఆర్పీఎఫ్ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉద్యోగ ఖాళీలపై ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలలో జాయిన్ అయితే మంచిదని చెప్పవచ్చు. సబ్-ఇన్‌స్పెక్టర్/మోటార్ మెకానిక్(కాంబాటైజ్డ్) ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్ విడుదలైన రెండు నెలల్లోగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 124 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 56 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పదో తరగతి పాసై మెకానిక్ మోటర్ వెహికల్‌లో ఐటీఐ సర్టిఫికేట్ లేదా మూడేళ్ల అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్, టిగ్రిటీ అండ్ విజిలెన్స్ క్లియరెన్స్, ఫైనల్ సెలక్షన్ ద్వారా ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే అభ్యర్థులకు రూ.35,400 నుంచి రూ.1,12,400 మధ్య వేతనం లభించే ఛాన్స్ ఉంటుంది. https://rect.crpf.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన డాక్యుమెంట్లను జత చేయాలి.
డైరెక్టరేట్ జనరల్, సీఆర్ పీఎఫ్, బ్లాక్ నం-1, సీజీఓ కాంప్లెక్స్, లోథి రోడ్, న్యూఢిల్లీ-110003 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.