రాత పరీక్ష లేకుండానే సెంట్రల్ బ్యాంక్‌లో భారీ సంఖ్యలో జాబ్స్.. మంచి వేతనంతో?

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్, వాచ్‌మెన్ గార్డెనర్ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 10 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలుకావడం గమనార్హం. సెంట్రల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మే నెల 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు 22 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండటంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 7వ తరగతి ఉత్తీర్ణులైన వాళ్లు తోటమాలి, చౌకీదార్ జాబ్స్ కు అర్హత కలిగి ఉంటారు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 6000 రూపాయల నుంచి 20000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.