స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా ssc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 4,187 ఎస్‌ఐ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) ఉద్యోగ ఖాళీలలో పురుషులకు 125 పోస్టులు ఉండగా మహిళలకు 61 పోస్టులు ఉన్నాయి. ట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో ఎస్‌ఐ(జనరల్ డ్యూటీ) ఉద్యోగ ఖాళీల విషయానికి వస్తే 4001 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 2023 సంవత్సరం ఆగష్టు 1 నాటికి 25 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.
2023 ఆగస్టు 1 నాటికి కనీసం 20 నుంచి గరిష్టంగా 25 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుందని తెలుస్తోంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేసి వివరాలను ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉండనుందని తెలుస్తోంది.
మూడు దశలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ.35,400 నుంచి రూ.1,12,400 మధ్య వేతనం లభించనుందని తెలుస్తోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది.