నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో 9212 కానిస్టేబుల్ ఉద్యోగ ఖాళీలు?

Job-Vacancy

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 9212 కానిస్టేబుల్ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈరోజు నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ నెల 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం.

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్లు జులైలో జరిగే ఆన్ లైన్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఇతర పరీక్షలు కూడా ఉంటాయి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ లను నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి 9105 పురుష అభ్యర్థులకు ఉండగా మిగిలిన ఉద్యోగాలు స్త్రీ అభ్యర్థులకు కేటాయించారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 69 వేల రూపాయల వరకు వేతనం లభించనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది. సీఆర్పీఎఫ్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

https://crpf.gov.in/archive-recruitment.htm వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుంటే మంచిది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలగనుంది.